మోదీ సరికొత్త రికార్డ్.... బహ్రెయిన్‌లో పర్యటించనున్న తొలి ప్రధానిగా నమో

ఆగస్టు 23 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్‌లలో మూడు రోజుల పాటు మోదీ పర్యటన కొనసాగనుంది.

news18-telugu
Updated: August 23, 2019, 9:05 AM IST
మోదీ సరికొత్త రికార్డ్.... బహ్రెయిన్‌లో పర్యటించనున్న తొలి ప్రధానిగా నమో
యూఏఈ పర్యటనకు మోదీ
  • Share this:
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాల్టీ నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ), బహ్రెయిన్‌ దేశాల్లో పర్యటించనున్నారు. 23న యూఏఈలోని అబుదాబిలో, 24న బహ్రెయిన్‌లో ప్రధాని పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను విదేశాంగ శాఖ పూర్తిచేసింది. యూఏఈ, బహ్రెయిన్‌లో మన దేశ పారిశ్రామికవేత్తల కోసం జారీ చేయనున్న రూపే కార్డును ప్రధాని ఆవిష్కరించనున్నారు. యూఏఈ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీకి  ఆదేశ అత్యున్నత పురస్రారమైన ఫాదర్‌ ఆఫ్‌ ఫౌండర్‌‌ను అందజేయనుంది. బహ్రెయిన్‌లో పర్యటించనున్న మొట్ట మొదటి ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటి వరకు మన దేశానికి చెందిన విదేశాంగ మంత్రులు, ఇతర శాఖల మంత్రులు మాత్రమే బహ్రెయిన్‌లో పర్యటించారు.

ఆగస్టు 23 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్‌లలో మూడు రోజుల పాటు మోదీ పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా ఇరు దేశాలు పరస్పర ఆసక్తి ఉన్న ద్వైపాక్షిక, ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై విస్తృతమైన చర్చలు జరపనున్నారు. పర్యటనలో భాగంగా మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో భేటీ కానున్నారు. పరస్పర ఆసక్తి ఉన్న ద్వైపాక్షిక, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ విషయాలపై ఇరువు చర్చించనున్నట్లు సమాచారం.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు