చైనా భారత భూభాగంలోకి చొరబడిందన్న బీజేపీ ఎంపీ.. ఖండించిన ఆర్మీ..

చగ్లగాం నుంచి మెక్‌మోహన్ రేఖ సుమారుగా 100కి.మీ ఉంటుందని, చగ్లగాంకు 25కి.మీ దూరంలో చైనా వంతెనను నిర్మించిందంటే.. 60-70కి.మీ మేర భారత భూభాగంలోకి చొరబడినట్టేనని బీజేపీ ఎంపీ తాపిర్ గావ్ అన్నారు.

news18-telugu
Updated: September 5, 2019, 11:30 AM IST
చైనా భారత భూభాగంలోకి చొరబడిందన్న బీజేపీ ఎంపీ.. ఖండించిన ఆర్మీ..
ఇండో చైనా బోర్డర్
  • Share this:
చైనా భారత భూభాగంలోకి చొరబడిందన్న బీజేపీ ఎంపీ తాపిర్ గావ్ వ్యాఖ్యలను భారత ఆర్మీ ఖండించింది. భారత్-చైనా సరిహద్దు అయిన మెక్‌మోహన్ రేఖను దాటి చైనా అరుణాచల్‌ప్రదేశ్‌లో 60కి.మీ మేర భూభాగాన్ని ఆక్రమించిందని గపిర్ తావ్ తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు. చైనా సరిహద్దును ఆనుకుని ఉన్న అంజా జిల్లాలోని చగ్లగాంకి సమీపంలో చైనా ఆర్మీ ఓ చెక్క వంతెనను కూడా నిర్మించిందన్నారు. చగ్లగాం నుంచి మెక్‌మోహన్ రేఖ సుమారుగా 100కి.మీ ఉంటుందని, చగ్లగాంకు 25కి.మీ దూరంలో చైనా వంతెనను నిర్మించిందంటే.. 60-70కి.మీ మేర భారత భూభాగంలోకి చొరబడినట్టేనని అన్నారు.

తాపిర్ గావ్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆర్మీ స్పందించింది. ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని చెప్పింది. ఆ ప్రాంతమంతా దట్టమైన సహజ సంపదతో.. నాలాలు,ప్రవాహాలతో కూడి ఉంటుందని ఆర్మీ చెప్పింది. వర్షాకాలంలో నాలాలు ఉప్పొంగితే నడవడానికి వీలుగా భారత ప్యాట్రోల్ అక్కడ వంతెనను నిర్మించినట్టు వెల్లడించింది. ఆ ప్రాంతంలో తరుచూ ఆర్మీ ప్యాట్రోల్ కొనసాగుతోందని.. అలాంటిచోట చొరబాటుకు ఆస్కారం లేదని తెలిపింది. 2005 ఒప్పందం ప్రకారం సరిహద్దు వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు భారత్-చైనా మధ్య అవగాహన ఉందని.. కాబట్టి సరిహద్దు వెంబడి చొరబాట్లకు అవకాశం లేదని చెప్పింది.

First published: September 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>