UP Election : అఖిలేష్ చెంతకు దేశంలోనే పొడవైన వ్యక్తి
ఎస్పీలో చేరిన పొడవైన వ్యక్తి
India's Tallest Man : దేశంలోనే అత్యంత పొడువైన వ్యక్తిగా గుర్తింపు పొందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ సమాజ్ వాదీ(SP)పార్టీలో చేరారు. ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ ఎత్తు 8.1 అడుగులు. ప్రపంచ రికార్డుకు కేవలం 11 సెంటీమీటర్లు తక్కువ.
India's Tallest Man : దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో చేరికల పర్వం ఊపందుకుంది. ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి నేతల జంపింగ్ లు,కొత్త వాళ్ల చేరికలతో పార్టీల్లో సందడి నెలకొంది. అయితే తాజాగా దేశంలోనే అత్యంత పొడువైన వ్యక్తిగా గుర్తింపు పొందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ సమాజ్ వాదీ(SP)పార్టీలో చేరారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ పటేల్ ఆధ్వర్యంలో శనివారం ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీలో ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ రాకను ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ పటేల్ స్వాగతించారు. ఎన్నికల ముందు ఆయన పార్టీలోకి రావడంతో పార్టీకి మరింత బలం చేకూరనుందని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ విధానాలు, అఖిలేష్ యాదవ్ నాయకత్వం నచ్చి ఆయన పార్టీలో చేరినట్టు చెప్పారు.
46 ఏళ్ల ధర్మేంద్ర ప్రతాప్ సింగ్..ప్రతాప్‌గఢ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. చదవు పూర్తి అయ్యాక ఉద్యోగం రాకపోవడంతో చిన్నా చితకా పనులు చేస్తుండేవారు. తరచూ అనారోగ్యం కారణంగా పెళ్లి కూడా చేసుకోలేదు. ఈక్రమంలో అతనికి గుర్తింపు తెచ్చిన ఎత్తే శాపంగా మారింది. అసాధారణ ఎత్తు కారణంగా ధర్మేంద్రకు నడుం వంగేందుకు సహకరించేది కాదు. గతంలో నడుం కింది భాగంలో హిప్ జాయింట్ లో నొప్పి రావడంతో డాక్టర్లు ఆపరేషన్ చేయాలనీ సూచించారు. దీంతో ఉద్యోగమే లేని ధర్మేంద్రకు ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేకపోవడంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిశాడు. తనకు సాయం చేయాలని ధర్మేంద్ర విన్నవించుకున్నాడు. దీంతో 2019లో డాక్టర్లు ధర్మేంద్రకు హిప్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం రాజకీయ నేతల ప్రచారంలో పాల్గొంటున్న ధర్మేంద్ర సమాజ్ వాదీ పార్టీలో చేరాడు.
ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని నరహర్‌పూర్ కాసియాహి గ్రామానికి చెందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ ఎత్తు 8.1 అడుగులు. ప్రపంచ రికార్డుకు కేవలం 11 సెంటీమీటర్లు తక్కువ. ఆసియా ఖండంలోనూ అత్యంత పొడవైన వ్యక్తుల జాబితాలో ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ కూడా ఒకరు. కాగా, తన ఎత్తే తనకు సెలబ్రెటీ హోదా, పేరు తెచ్చిందని ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. ఇక,యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయని,ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుందని ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.