భారత్ చేతికి స్విస్ ఖాతాల వివరాలు.. నల్ల కుబేరుల లెక్కలు తేలుతాయా..?

Indian related Swiss Accounts Details : భారత్‌కు చెందిన స్విస్ ఖాతాల గురించి ఎఫ్‌టీఏ అధికారి ఒకరిని ఆరా తీయగా.. ఆ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతున్నామని.. ప్రభుత్వంతో తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని బయటకు వెల్లడించమని చెప్పారు. మరో విడత వివరాలు 9 నెలల్లోగా భారత్‌కు అందించే అవకాశం ఉందన్నారు.

news18-telugu
Updated: October 7, 2019, 6:42 PM IST
భారత్ చేతికి స్విస్ ఖాతాల వివరాలు.. నల్ల కుబేరుల లెక్కలు తేలుతాయా..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో స్విస్ ఖాతాల్లో దాగున్న నల్ల ధనాన్ని వెనక్కి తెప్పిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఐదేళ్ల పాలనలో ఆ హామీని నిలబెట్టుకోలేకపోయిన బీజేపీ ప్రభుత్వం.. రెండోసారి అధికారం చేపట్టాక కూడా దానిపై విమర్శలు కొనితెచ్చుకుంది. అయితే తాజాగా స్విస్ బ్యాంకులోని భారతీయుల ఖాతాలకు సంబంధించిన వివరాలను కేంద్రం చేతికి అందాయి. స్విట్టర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్(FTA) ఈ వివరాలను భారత్‌కు అందించినట్టు పీటీఐ వెల్లడించింది. దీంతో నల్లధనంపై కేంద్రం పోరాటంలో తొలి అడుగు పడినట్టేనన్న వాదన వినిపిస్తోంది.

ఏఈఓఐ పద్దతిలో ఎఫ్‌టీఏ భారత్‌కు స్విస్ ఖాతాల వివరాలను వెల్లడించింది. భారత్‌తో పాటు మరో 75 దేశాలకు ఆయా దేశాల ఖాతాదారుల వివరాలను పంపించింది.ఇందులో ఆయా ఖాతాదారుల పేరు,చిరునామా,ఖాతా నంబర్ వంటి వివరాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించని ఎఫ్‌టీఏ.. తొలి విడత కింద కొంతమంది స్విస్ ఖాతాల వివరాలు మాత్రమే భారత్‌కు అందించింది. మరో విడత కింద 2020లో మరికొన్ని ఖాతాల వివరాలు అందిస్తామని తెలిపింది. ఎఫ్‌టీఏ తాజాగా వెల్లడించిన భారత స్విస్ ఖాతాదారుల వివరాల్లో.. కేవలం నల్ల కుబేరుల వివరాలే కాకుండా.. పారదర్శకంగా లావాదేవీలు నిర్వహించే వ్యాపారదారులకు చెందిన ఖాతాదారుల వివరాలు కూడా ఉండవచ్చు.


భారత్‌కు చెందిన స్విస్ ఖాతాల గురించి ఎఫ్‌టీఏ అధికారి ఒకరిని ఆరా తీయగా.. ఆ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతున్నామని.. ప్రభుత్వంతో తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని బయటకు వెల్లడించమని చెప్పారు. మరో విడత వివరాలు 9 నెలల్లోగా భారత్‌కు అందించే అవకాశం ఉందన్నారు. అంటే,వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ఆ వివరాలు అందిస్తామన్నారు.ఇదిలా ఉంటే,భారత్ చేతికి స్విస్ ఖాతాల వివరాలు రావడంతో.. నల్ల కుబేరుల అవినీతి లెక్కలను ప్రభుత్వం బయటపెడుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. నల్లధనం వెలికితీసి ప్రతీ ఒక్కరి ఖాతాల్లో రూ.15లక్షలు జమ చేస్తామని అప్పట్లో మోదీ చెప్పిన మాటలను జనం ఇప్పుడు మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు.
First published: October 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading