రేప్‌ల రాజధాని ఇండియా.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..

దిశ, ఉన్నావ్ లైంగిక దాడులు జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేప్‌లకు రాజధానిగా భారత్ మారిపోతోందని వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: December 7, 2019, 3:31 PM IST
రేప్‌ల రాజధాని ఇండియా.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
రాహుల్ గాంధీ
  • Share this:
దిశ, ఉన్నావ్ లైంగిక దాడులు జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేప్‌లకు రాజధానిగా భారత్ మారిపోతోందని వ్యాఖ్యానించారు. ఈ రోజు కేరళలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.. వయనాడ్‌లో ఓ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యాచారాలపై తీవ్రంగా స్పందించారు. అత్యాచార ఘ‌ట‌న‌ల‌కు భార‌త్‌.. ప్ర‌పంచ దేశాల‌ రాజ‌ధానిగా మారింద‌న్నారు. భార‌త్ త‌మ కూతుళ్లు, అక్కాచెల్లెళ్లను ఎందుకు సుర‌క్షితంగా చూసుకోవ‌డం లేద‌ని ప్రపంచదేశాలు అడుగుతున్నాయని అన్నారు. ఓ యూపీ బీజేపీ ఎమ్మెల్యేకు మహిళను రేప్ చేసిన కేసులో హస్తం ఉందని, దానిపై ప్రధాని మోదీ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: December 7, 2019, 3:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading