Video: టెస్ట్ చేసి చూశాం.. రెండు నిమిషాల్లో ‘ఇంక్’ మాయం

news18-telugu
Updated: April 11, 2019, 8:15 PM IST
Video: టెస్ట్ చేసి చూశాం.. రెండు నిమిషాల్లో ‘ఇంక్’ మాయం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 11, 2019, 8:15 PM IST
ఎన్నికల పోలింగ్ సందర్భంగా చూపుడు వేలికి వేసే ఇంక్ అంటే చాలా నమ్మకం. ఆ ఇంక్ చెరిగిపోదని, చాలా రోజుల పాటు ఉంటుందని నమ్ముతాం. అయితే, ఆ ఇంక్ మీద కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఎన్నికల అధికారులు వేసిన ఇంక్‌ను క్షణాల్లోనే తుడిచేసిన కొందరు నెటిజన్లు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఏం చేస్తే.. ఆ ఇంక్ చెరిగిపోతుందో కూడా వివరించారు. ఇంక్ మీద నెయిల్ పాలిష్ వేసి క్లీన్ చేస్తే చాలా మందికి సిరా చుక్క మాయమైపోయింది. ఇదే విషయాన్ని టెస్ట్ చేయడానికి న్యూస్‌18 కూడా ప్రయత్నించింది. నోయిడాలో ఓటేసిన కొందరు వ్యక్తుల మీద ప్రయోగాత్మకంగా దీన్ని చెక్ చేసింది. అందులో చాలా మందికి వేలి మీద ఉన్న ఇంక్ గుర్తు చెరిగిపోయింది.





చాలా మంది ఇలాగే తమ వేలికి ఉన్న సిరా గుర్తును చెరిపేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...