రజనీకాంత్ విషయంలోనే అలా ఎందుకు జరిగింది.. వివరణ కోరిన ఈసీ

రెండో దశలో జరిగిన తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో రజనీకాంత్ ఉదయం 7గంటలకే పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్న సంగతి తెలిసిందే. లోక్‌సభతో పాటు పలు అసెంబ్లీ స్థానాలకు కూడా అక్కడ ఉపఎన్నికలు జరిగాయి.

news18-telugu
Updated: April 20, 2019, 12:09 PM IST
రజనీకాంత్ విషయంలోనే అలా ఎందుకు జరిగింది.. వివరణ కోరిన ఈసీ
ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న తలైవా రజినీకాంత్
news18-telugu
Updated: April 20, 2019, 12:09 PM IST
ఎన్నికల నిబంధన మేరకు ఓటు వేసిన తర్వాత ఓటరు ఎడమ చేయికి సిరా గుర్తు వేయడం కామన్. అయితే ఇటీవలి ఎన్నికల్లో సూపర్ సార్ట్ రజనీకాంత్‌కు ఎడమ చేతికి కాకుండా.. కుడి చేతి వేలికి అధికారులు సిరా గుర్తు వేశారు. ఓటు వేసిన అనంతరం రజనీకాంత్ సిరా గుర్తును చూపిస్తూ ఫోటో దిగడంతో.. ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో ఎన్నికల సంఘం దీనిపై స్థానిక అధికారులను వివరణ కోరింది. స్పందించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సాహు.. కుడి చేతికి సిరా గుర్తు వేయడం తప్పే అన్నారు. అయితే ఇలా ఎందుకు జరిగిందో తెలియదని.. వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

కాగా, రెండో దశలో జరిగిన తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో రజనీకాంత్ ఉదయం 7గంటలకే పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్న సంగతి తెలిసిందే. లోక్‌సభతో పాటు పలు అసెంబ్లీ స్థానాలకు కూడా అక్కడ ఉపఎన్నికలు జరిగాయి. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా ఉంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగబోతున్నానని రజనీకాంత్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గతంలోనూ రేపు మాపు అంటూ వాయిదా వేస్తూ వచ్చిన రజనీ.. ఈసారైనా మాట మీద నిలబడుతారో లేదో చూడాలి.

First published: April 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు