అన్నా.. అక్కా.. జగన్ పలకరింపులో తొణికిసలాడే ఆప్యాయత..

YS Jagan Swearing-in Ceremony: పట్టరాని కోపం వచ్చిన సందర్భంలో, ఎదుటి వారిని తిట్టే సందర్భంలో కూడా ‘అన్నా’ అనే మాటను మాత్రం జగన్ వదలరు.

Bommakanti Shravan | news18-telugu
Updated: May 30, 2019, 11:41 AM IST
అన్నా.. అక్కా.. జగన్ పలకరింపులో తొణికిసలాడే ఆప్యాయత..
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
  • Share this:
‘యెడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి అనే నేను..’ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్ ఎవరినైనా ఆప్యాయంగా పలకరిస్తారు. తోటి నాయకుల దగ్గర నుంచి, తన వద్ద పనిచేసే ఉద్యోగుల వరకు అందర్నీ అన్నా.. అక్కా.. అని సంబోధిస్తారు. మరీ సన్నిహితంగా ఉన్నవారిని మాత్రమే ఆయన పేరు పెట్ట పిలుస్తారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులను కూడా జగన్.. ‘అన్నా’ అనే అంటారు. మహిళలను ‘అక్కా’ అని పిలుస్తారు. జగన్ మాదిరిగానే ఆయన సతీమణి భారతి రెడ్డి కూడా ‘అన్నా, అక్కా’ అని సంభోదిస్తారు. ఆయనకు పట్టరాని కోపం వచ్చిన సందర్భంలో కూడా ఎదుటి వారిని తిట్టే సందర్భంలో కూడా ‘అన్నా’ అనే మాట మాత్రం వదలరు. కానీ, అసెంబ్లీలో రాజకీయ వైరులను సంబోధించే సందర్భంలో మాత్రం పేరు పెట్టి పిలుస్తారు. ఏకవచనం ప్రయోగిస్తారు.

గతంలో అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబును, ఆయన మంత్రి వర్గ సహచరులను ‘నువ్వు’ అని సంబోధించి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. జగన్ చిన్నా,పెద్దా తారతమ్యం లేకుండా ఏకవచనంతో మాట్లాడుతున్నారని ఆక్షేపణలు ఉన్నాయి.

First published: May 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు