డీఎంకే నేత రూ.9 కోట్లు ఎక్కడ దాచాడో తెలుసా ?...ఐటీ అధికారులకే షాక్...

తమిళనాడులోని ఒక ప్రముఖ డీఎంకే లీడర్ కు చెందిన సిమెంట్ బస్తాల గోడౌన్ పై దాడులు చేయగా ఏకంగా రూ.9 కోట్లు పట్టుబడ్డాయి. ఈ ఘటన తమిళనాడులోని వేలూరులో చోటు చేసుకుంది. సిమెంట్ బస్తాల్లో మాటున కట్టలు కట్టలుగా నగదు దొరకడంతో ఐటీ అధికారులు నోరెళ్లబెట్టారు.

news18-telugu
Updated: April 1, 2019, 8:47 PM IST
డీఎంకే నేత రూ.9 కోట్లు ఎక్కడ దాచాడో తెలుసా ?...ఐటీ అధికారులకే షాక్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సార్వత్రిక ఎన్నికల వేళ విచ్చలవిడిగా చలామణి అవుతున్న డబ్బును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ఐటీ అధికారులు చేయని ప్రయత్నం లేదు. ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఇటీవల తమిళనాడులోని ఒక ప్రముఖ డీఎంకే లీడర్ కు చెందిన సిమెంట్ బస్తాల గోడౌన్ పై దాడులు చేయగా ఏకంగా రూ.9 కోట్లు పట్టుబడ్డాయి. ఈ ఘటన తమిళనాడులోని వేలూరులో చోటు చేసుకుంది. సిమెంట్ బస్తాల్లో మాటున కట్టలు కట్టలుగా నగదు దొరకడంతో ఐటీ అధికారులు నోరెళ్లబెట్టారు. అయితే ఇదంతా ప్రతిపక్ష పార్టీల కుట్ర అని డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ విమర్శించారు.

ఐటీ శాఖ రైడ్ చేసిన సిమెంట్ బస్తాల గోడౌన్ ఇటీవలే డీఎంకే తరపున వేలూరు నుంచి పోటీచేస్తున్న కతీర్ ఆనంద్‌కు సంబందించినది కావడం విశేషం. అలాగే విరుదంపట్టు గ్రామానికి చెందిన మరో డీఎంకే నేత నివాసంపై కూడా ఐటీ రైడ్స్ చేశారు. కాగా ఐటీ రైడ్స్ పై సదరు డీఎంకే నేత మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఐటీ దాడులన్నీ కూడా కక్షసాధింపు చర్యల్లో భాగమని పిటిషన్ లో పేర్కొన్నాడు

మరోవైపు అధికార అన్నాడీఎంకే పార్టీ కేంద్రంలోని బీజేపీతో కలిసి ఐటీ దాడులకు ఉసిగొల్పుతోందని డీఎంకే నేతలు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే డీఎంకే పార్టీ ఆపరేషన్ బ్లూ స్కై పేరిట ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో రూ.100 కోట్ల డబ్బు పంచే విధంగా యాక్షన్ ప్లాన్ తో దిగిందని తమిళనాడు రాష్ట్రమంత్రి డి. జయకుమార్ ఆరోపించారు.

ఇదిలా ఉంటే ఇటీవల పక్క కర్ణాటకలోనూ ఐటీ డిపార్ట్‌మెంట్ చేసిన దాడుల్లో అధికార జేడీఎస్ పార్టీ సభ్యుల ఇళ్లపై కూడా దాడులు చేయగా, ఏకంగా ఆ పార్టీ కార్యకర్తలు ఆదాయపన్ను శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం వార్తల్లో నిలిచింది.
First published: April 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading