చంద్రబాబు చుట్టూ అష్టదిగ్బంధం?... తెరవెనుక ఏం జరుగుతోంది?

పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ తోపాటు చైతన్య విద్యాసంస్ధల అధినేత బీఎస్ రావు, నారాయణ సంస్ధల అధినేత నారాయణ ముగ్గురూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులే.

news18-telugu
Updated: March 5, 2020, 2:56 PM IST
చంద్రబాబు చుట్టూ అష్టదిగ్బంధం?... తెరవెనుక ఏం జరుగుతోంది?
చంద్రబాబునాయుడు (File)
  • Share this:
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్ధిక మూలాలను ఐటీ టార్గెట్ చేసిందా?. జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే అవుననే సమాధానం చెపుతున్నారు రాజకీయ విశ్లేషకులు. గత కొద్ది రోజులుగా ఏపీలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. వరుసగా జరిగిన దాడులను గమనిస్తే చంద్రబాబు నాయుడుకు ఆర్ధిక మూలాలుగా ఉన్న సంస్థలనే టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. దీనికి ప్రస్తుతం వినిపిస్తున్న కారణం గత ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసి, వాటికి కావాల్సిన ఆర్ధిక వనరులను ఏపీలోని టీడీపీ అనుకూల సంస్థలే సమకూర్చాయని కేంద్రం భావించడమే కారణం అని వినిపిస్తోంది. జరిగిన దాడుల్లో ఎన్ని ఆధారాలు లభించాయన్న విషయంలో మాత్రం స్పష్టత లేకున్నా.. ఇంకా ఎన్ని సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయన్నది తెలియక టీడీపీ శ్రేణులు కూడా ఆందోళన చెందుతున్నాయి. గతంలో ముంబైలో జరిగిన స్థిరాస్తి వ్యాపార సంస్థపై జరిగిన ఐటీ దాడుల్లో, చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంటిలో జరిగిన దాడుల్లో రెండు వేల కోట్ల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు లభించాయని ప్రకటన మాత్రం విడుదల చేసింది ఐటీ శాఖ.

LingamaLingamaneni,Lingamaneni ramesh,Lingamaneni estates,Lingamaneni ventures,it raids on Lingamaneni,it raids on Lingamaneni ventures,it raids on Lingamaneni estates,లింగమనేని,లింగమనేని రమేష్,లింగమనేని ఎస్టేట్స్,లింగమనేని వెంచర్స్,లింగమనేని వెంచర్స్‌పై ఐటీ దాడులు,లింగమనేని ఐటీ దాడులు,విజయవాడలో ఐటీ దాడులు,neni Ramesh, air coasta, ap news, లింగమనేని రమేశ్, ఎయిర్ కోస్టా, ఏపీ న్యూస్
లింగమనేని రమేశ్(ఫైల్ ఫోటో)


గత రెండు రోజులుగా మరికొందరి కార్యాలయాల్లో దాడులు నిర్వహిస్తోంది ఐటీ. ఇందులో చంద్రబాబుకు ఉండవల్లి నివాసం యజమాని లింగమనేని రమేష్ కు చెందిన లింగమనేని ప్రాపర్టీస్ తో పాటు చైతన్య విద్యాసంస్ధలు కూడా ఉన్నాయి. విజయవాడ గాయత్రీ నగర్ లోని లింగమనేని ప్రాపర్టీస్ కార్యాలయంతో పాటు రాష్ట్రంలో శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్ధలకు చెందిన పలు క్యాంపస్ లలో ఐటీ దాడులు చేస్తోంది. ఇందులో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయని సమాచారం. ఇంకా స్పష్టత రావాలంటే ఆదాయపన్ను అధవకారులు ప్రకటన చేయాల్సిందే. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత ఆదేశాలతో ఈ సంస్థల ద్వారా హవాలా మార్గంలో మోదీ వ్యతిరేక పార్టీలకు నిధులు సమకూర్చారనే అనుమానాలు ఎక్కువగా వినవస్తున్నాయి.

minister narayana, Chandrababu naidu, ys Jagan, KTR, AP Politics, Jagan KTR Meeting, AP TDP, andhra pradesh news updates, జగన్, కేటీఆర్, నారాయణ
నారాయణ


పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ తోపాటు చైతన్య విద్యాసంస్ధల అధినేత బీఎస్ రావు, నారాయణ సంస్ధల అధినేత నారాయణ ముగ్గురూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులే. వీరంతా గతంలో టీడీపీ విజయం కోసం పలు ఎన్నికల్లో ఆర్ధిక సాయం చేసిన వారే. చంద్రబాబుని కేంద్రం టార్గెట్ చేయటం వైసీపీకి కూడా రాజకీయంగా కలిసొచ్చే అంశం కాబట్టి... వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన తరువాత ఐటీ దాడుల తీవ్రత పెరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీలో చంద్రబాబుకి సంబంధించి విషయాలు చర్చకు చోటుచేసుకున్నాయి అనే దానికి ఈ తాజాపరిమాణాలు బలాన్ని చేకూరుస్తున్నాయి.

(రఘు అన్నా, గుంటూరు కరస్పాండెంట్, న్యూస్‌18) 
First published: March 5, 2020, 2:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading