కర్ణాటకలో సంచలనం.. ‘దేవెగౌడ కుటుంబ ఆలయం’లో ఐటీ దాడులు..

దేవెగౌడ సొంత గ్రామంలో ఉండే ఈశ్వర ఆలయంలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేశారని, పూజారి భార్య తెలిపారు. ఐటీ అధికారులు ఆలయం మొత్తం తనిఖీ చేశారని, గర్భాలయంలోకి కూడా వెళ్లి సోదాలు చేశారని ఆమె తెలిపారు.

news18-telugu
Updated: April 12, 2019, 2:53 PM IST
కర్ణాటకలో సంచలనం.. ‘దేవెగౌడ కుటుంబ ఆలయం’లో ఐటీ దాడులు..
వినాయకుడికి పూజలు చేస్తున్న దేవెగౌడ (ఫైల్ ఫొటో)
  • Share this:
ఎన్నికల వేళ కర్ణాటకలో సంచలనం చోటుచేసుకుంది. మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ కుటుంబానికి సంబంధించిన దేవాలయంలో ఐటీ దాడులు జరిగాయి. దేవాలయ పూజారి ఇంట్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేసినట్టు తెలిసింది. దేవెగౌడ సొంత గ్రామంలో ఉండే ఈశ్వర ఆలయంలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేశారని, పూజారి భార్య తెలిపారు. ఐటీ అధికారులు ఆలయం మొత్తం తనిఖీ చేశారని, గర్భాలయంలోకి కూడా వెళ్లి సోదాలు చేశారని ఆమె తెలిపారు. కర్ణాటకలోని హర్దనహళ్లి గ్రామంలో హెచ్‌డీ దేవెగౌడ కుటుంబం ఈశ్వర ఆలయాన్ని నిర్మించింది. సహజంగా దైవ భక్తులైన గౌడ కుటుంబసభ్యుల కోసం అక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఎన్నికల సమయంలో ఏకంగా ఆలయంలో కూడా ఐటీ దాడులు చేయడం సంచలనంగా మారింది. అయితే, దీన్ని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్రంగా ఖండించారు. ‘హిందూ పార్టీగా చెప్పుకునే బీజేపీకి చెందిన ఐటీ శాఖ అధికారులు మా గ్రామంలోని శివాలయంలో తనిఖీలు చేశారు. కానీ, ఏమీ దొరకలేదు. శివుడు బీజేపీని నాశనం చేస్తాడు’ అని కుమారస్వామి ట్వీట్ చేశారు.

ఏపీ ఇంటర్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండిFirst published: April 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు