యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం.. మంత్రులకు షాక్

1981 నుంచి ఇప్పటి వరకు తొమ్మిది మంది ముఖ్యమంత్రులు మారారు. కానీ, చట్టంలో నుంచి ఆ నిబంధనను మాత్రం తొలగించలేకపోయారు.

news18-telugu
Updated: September 13, 2019, 9:06 PM IST
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం.. మంత్రులకు షాక్
యోగి ఆదిత్యనాథ్
  • Share this:
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, డిప్యూటీ మంత్రుల ఆదాయపన్నును ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించకూడదని నిర్ణయించింది. ఉత్తర ప్రదేశ్‌లో 1981 నుంచి ఈ విధానం అమలవుతోంది. అప్పటి నుంచి మంత్రుల జీతాలపై ఆదాయపన్నును ప్రభుత్వమే తమ ఖజానా నుంచి చెల్లిస్తుంది. దీనిపై పెద్ద దుమారం రేగింది. మిగిలిన ప్రజలు అందరూ తమ జీతాల మీద ఆదాయపన్నును వారే చెల్లిస్తుంటే, వారికి మాత్రం ప్రత్యేక ప్రయోజనాలు ఎందుకనే ప్రశ్న తెరపైకి వచ్చింది. 1981లో ఈ నిబంధన పెట్టినప్పుడు ముఖ్యమంత్రి వేతనం నెలకు రూ.1000, మంత్రుల వేతనాలు రూ.650 ఉండేవి. అయితే, ఇప్పుడు సీఎం నెలకు రూ.40వేల జీతం తీసుకుంటున్నారు. మంత్రులు రూ.35వేలు అందుకుంటున్నారు. గడిచిన 38 సంవత్సరాల్లో మంత్రుల వేతనాలు 40 సార్లు పెరిగాయి. అలాంటప్పుడు వారి ఇన్ కం ట్యాక్స్ ఇంకా ప్రభుత్వమే చెల్లించాలనుకోవడం సరికాదని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అభిప్రాయపడింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రుల ఆదాయపన్ను కింద ప్రభుత్వ ఖజానా నుంచి రూ.81లక్షలను చెల్లించడంతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. 1981 నుంచి ఇప్పటి వరకు తొమ్మిది మంది ముఖ్యమంత్రులు మారారు. కానీ, చట్టంలో నుంచి ఆ నిబంధనను మాత్రం తొలగించలేకపోయారు.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...