మహారాష్ట్ర ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Deputy CM Ajith Pawar)కు ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఆయన సంబంధీకులవిగా చెప్తోన్న దాదాపు 1,000 కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ (IT Department) జప్తు చేసింది. అజిత్ పవార్‌కు చెందిన రూ.1,000 కోట్ల విలువైన మొత్తం 5 ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసినట్లు (Assets worth Rs 1,000 crore seized) ఏఎన్ఐ వెల్లడించింది. ముంబైలోని పవార్ కార్యాలయం (Pawar office) కూడా ఇందులో ఉంది. గతంలో ముంబైలోని ఆర్థిక నేరాల విభాగంలో అజిత్ పవార్‌పై మనీలాండరింగ్ కేసు నమోదైంది. దీనిపై ఈడీ, ఐటీ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఐటీ విభాగం ఆయన కుటుంబీకుల ఆస్తులను జప్తు చేయడం సంచలనం రేకెత్తించింది. దక్షిణ దిల్లీలో ఉన్న అజిత్ పవార్‌కు చెందిన 20 కోట్ల విలువైన ఓ ఫ్లాట్‌ను కూడా సీజ్ (seize) చేసినట్లు సమాచారం. నిర్మల్ టవర్ (Nirmal tower)లో ఉన్న పవార్ కార్యాలయం విలువ రూ.25 కోట్లు ఉంటుంది.
గత నెలలో పవార్ సోదరి ఇళ్లు, కంపెనీలపై ఐటీ శాఖ దాడులు చేసింది. అజిత్ పవార్, ఆయన దగ్గరి వారికి చెందిన దాదాపు 70 చోట్ల ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ శాఖ ఈ దాడులు చేసింది .
దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు..
తాము పన్నులు సక్రమంగానే చెల్లిస్తున్నామని అజిత్‌పవార్ అన్నారు. తాను ఆర్థిక మంత్రినైనందున (Finance minister) తనకు ఆర్థిక క్రమశిక్షణ బాగా తెలుసునన్నారు. కాగా, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై పవార్ మండిపడ్డారు. తన సోదరీమణులకు సుమారు 35 సంవత్సరాల క్రితం వివాహమైందని, వారి ఇళ్ళు, సంస్థలపై కూడా సోదాలు జరగడం బాధాకరమని పేర్కొన్నారు. తాజా ఐటీ దాడులపై బీజేపీ నేత కిరీట్ సోమయ్య స్పందిస్తూ.. జప్తు చేసిన ఆస్తులు అజిత్ పవార్ కుమారుడు, భార్య, తల్లి, సోదరి, అల్లుడి పేరు మీద ఉన్నాయని వివరించారు.
జప్తు చేసిన ఆస్తుల వివరాలు..
జరందేశ్వర్ షుగర్ ఫ్యాక్టరీ- విలువ రూ.600 కోట్లు
గోవాలోని నిలయ రిసార్ట్- విలువ రూ.250 కోట్లు
మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27 ఫ్లాట్లు- విలువ రూ.500 కోట్లు
Income Tax Department has attached properties of Maharashtra Deputy CM Ajit Pawar worth Rs 1000 cr. Five properties including Nirmal Tower at Nariman Point, Mumbai has been attached by IT Dept. Last month, IT Dept conducted raids at houses& companies of sisters of Pawar: Sources pic.twitter.com/WaCD71BfIa
— ANI (@ANI) November 2, 2021
జూలైలోనే..
కాగా, గత జూలైలోనే పవార్‌కు చెందిన కొన్ని ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసింది. అజిత్ పవార్ కి అయన భార్యకి చెందిన 65 కోట్ల విలువైన షుగర్ మిల్లును, ఇతర ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మహారాష్ట్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు స్కామ్ తో దీనికి లింక్ ఉన్నట్టు ఈ సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ మిల్లును అజిత్ పవార్ తో బాటు ఆయన భార్య సునేత్ర అజిత్ పవార్ కూడానా నిర్వహిస్తునట్టు అధికారులు వెల్లడించారు. అటాచ్ చేసిన ఆస్తుల్లో భూమి, బిల్డింగ్, ప్లాంట్, ఇంకా యంత్రాలు ఉన్నాయి. ఇవి మొత్తం 65.75 కోట్ల విలువైనవని.. ఇది 2010 నాటి కొనుగోలు ధర అని వారు చెప్పారు. అంటే ఇప్పటి ధరతో పోలిస్తే ఇంకా వందల కోట్ల విలువ గలవైనవిగా కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆస్తులు గురు కమోడిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉండగా వీటిని జరందేశ్వర్ షుగర్ మిల్స్ కంపెనీకి లీజుకు ఇచ్చారు. ఈ మిల్స్ కి చెందిన మెజారిటీ షేర్లు అజిత్ పవార్ కి సంబంధించిన స్పార్క్ లింగ్ సాయిల్ కంపెనీలో ఉన్నట్టు ఈడీ ఓ స్టేట్ మెంట్ లో తెలిపింది. 2019 లో ముంబై పోలీసు శాఖ లోని ఆర్ధిక నేరాల విభాగం నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ దీన్ని దర్యాప్తు చేసింది. అసలు గురు కమోడిటీ సర్వీసెస్ అన్నది డమ్మీ కంపెనీ అని ఈ సంస్థ పేర్కొంది. దీనిపై ఇంకా విచారిస్తామని అధికారులు తెలిపారు. తాజాగా 1000 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది ఐటీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ajith, Income tax, IT raids, Maharashtra, NCP