టీడీపీ ఎంపీ అభ్యర్థి ఇంటిపై ఐటీ దాడులు...

గుంటూరులోని గల్లా జయదేవ్ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన కార్యాలయ సిబ్బందిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

news18-telugu
Updated: April 9, 2019, 11:17 PM IST
టీడీపీ ఎంపీ అభ్యర్థి ఇంటిపై ఐటీ దాడులు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐటీ దాడుల కలకలం రేగుతోంది. టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ కార్యాలయంలో ఐటీ దాడులు జరిగాయి. గుంటూరులోని గల్లా జయదేవ్ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన కార్యాలయ సిబ్బందిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. వైసీపీ తరఫున మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇటీవల టీడీపీ నేతల నివాసాల్లో ఐటీ దాడులు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం కావాలనే దాడులు చేయిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. గల్లా జయదేవ్ కంపెనీ అకౌంటెంట్ ‌ను ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

తన కార్యాలయంపై ఐటీ సోదాలు చేయడంతో గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. గల్లా జయదేవ్‌తో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు కూడా ధర్నాలో కూర్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం టీడీపీని టార్గెట్ చేసి ఐటీ దాడులు చేయిస్తోందని గల్లా జయదేవ్ మండిపడ్డారు.

First published: April 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు