కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. రాజ్యసభ ఎన్నికల వేళ ఎమ్మెల్యేల రాజీనామా

మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 61కి పడిపోయింది. దాంతో రాజ్యసభ ఎన్నికల్లో రెండు సీట్లు గెలవాలన్న కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి.

news18-telugu
Updated: June 4, 2020, 7:15 PM IST
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. రాజ్యసభ ఎన్నికల వేళ ఎమ్మెల్యేల రాజీనామా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గుజరాత్‌లో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వడోదర ఎమ్మెల్యే అక్షయ్ పటేల్, కప్రాడా ఎమ్మెల్యే జితు చౌదురి రాజీనామా చేయగా.. వాటిని గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది ఆమోదించారు. వీరిద్దరి రాజీనామాతో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల గెలుపు అవకాశాలు తగ్గనున్నాయి. ఐతే దీని వెనక బీజేపీ కుట్ర ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులోకి తమను లాగవద్దని.. పార్టీపై అసంతృప్తితోనే రాజీనామా చేశారని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది.


గుజరాత్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌ ఇద్దరు అభ్యర్ధులను బరిలో దింపగా, బీజేపీ నుంచి ముగ్గురు పోటీలో ఉన్నారు. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో బీజేపీకి 103 సభ్యుల బలముంది. కాంగ్రెస్ పార్టీ నుంచి 68 మంది గెలిచారు. ఇక భారతీయ ట్రైబల్‌ పార్టీ 2, ఎన్‌సీపీ, స్వతంత్రులు ఒక్కో స్థానాల్లో గెలుపొందారు. ఐతే మార్చిలో కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు రాజీనామా చేయగా.. తాజాగా మరో ఇద్దరు పార్టీని వీడారు. మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేల రాజీనామాతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 61కి పడిపోయింది. దాంతో రాజ్యసభ ఎన్నికల్లో రెండు సీట్లు గెలవాలన్న కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి. అటు బీజేపీ తమ ముగ్గురు అభ్యర్థులను గెలిపించుకునేందుకు పావులు కదుపుతోంది.
Published by: Shiva Kumar Addula
First published: June 4, 2020, 7:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading