హోమ్ /వార్తలు /National రాజకీయం /

AP Cabinet: త్వరలోనే ఏపీ కేబినెట్ విస్తరణ...? మంత్రుల్లో ఎవరు సేఫ్? కొత్తగా వచ్చేది ఎవరు..?

AP Cabinet: త్వరలోనే ఏపీ కేబినెట్ విస్తరణ...? మంత్రుల్లో ఎవరు సేఫ్? కొత్తగా వచ్చేది ఎవరు..?

ఏపీలో కేబినెట్ లో మార్పులు చేర్పులు

ఏపీలో కేబినెట్ లో మార్పులు చేర్పులు

త్వరలోనే కేబినెట్ ను విస్తరించేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారా..? మరి ఎందరు మంత్రులు సేఫ్..? కొత్తగా కేబినెట్ లోకి వచ్చే అవకాశం ఎవరికి ఉంది..? సీఎం జగన్ వేస్తున్న లెక్కలు ఏంటి..?

  ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండేళ్ల క్రితం ఏపీలో భారీ మెజారిటీతో వైసీపీ అధికారం చేపట్టింది. అప్పుడు మంత్రి పదవులపై ఆశావాహలు ఎక్కువగా ఉండడంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలతో పాటు సామాజిక సమీకరణాల విషయంలో రాజీ పడకుండా అందర్నీ ఒప్పించి సీఎం జగన్ కేబినెట్ కూర్పు చేశారు. దీంతో కేబినెట్‌ బెర్తులపై ఎక్కడా విమర్శలు ఎదురుకాలేదు. కానీ చాలమంది సీఎం నిర్ణయంపై బయటకు చెప్పుకోలకపోయినా లోలోన మదనపడుతున్నరన్న విషయం గ్రహించిన జగన్.. అప్పట్లో ఎదురైన భారీ పోటీని దృష్టిలో ఉంచుకుని దాదాపు 90 శాతం మంత్రుల్ని రెండున్నరేళ్ల తర్వాత మార్చి వారిస్ధానంలో మరొకరికి చోటిస్తామని హామీ ఇచ్చారు. దీంతో నేతలంతా సరే రెండున్నరేళ్లు ఓపిక పడదామంటూ సర్దుకుపోయారు. సీఎం జగన్ చెప్పిన లెక్క ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌లో మరోసారి కేబినెట్‌ మార్పులకు సిద్ధమవ్వాల్సి ఉంది. దీంతో ఇప్పుడంతా లెక్కలు వేసుకుంటున్నారు. ఈ సారైనా తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ అధిష్టానం ముందు లాబీయింగ్ మొదలెట్టారు. మరోవైపు కొందరి మంత్రుల్లో కూడా టెన్షన్ మొదలైంది. తమ బెర్త్ లు సేఫా కాదా అని లెక్కలు వేసుకుంటున్నారు.

  సీఎం జగన్ సైతం కొందరి మంత్రుల పని తీరుపై అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే గతంలో హామీ ఇచ్చిన కొందరు కష్టపడి పని చేస్తుండడంతో వారికి కేబినెట్ లో చోటివ్వాలని సీఎం జగన్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుత మంత్రుల స్ధానాల్లో మళ్లీ అవే సామాజిక సమీకరణాలు, ఇతర ఈక్వేషన్లను దృష్టిలో పెట్టుకుని విస్తరణ చేపడతారని ప్రచారం జరుగుతోంది.

  ఇదీ చదవండి: సీఎం సొంత జిల్లాలో అధికార పార్టీకి షాక్.. చంద్రబాబును కలిసిన వైసీపీ నేత

  నవంబర్‌ లేదా డిసెంబర్‌లో కేబినెట్‌ విస్తరణ చేపట్టే అవకాశం ఉందంటున్నారు. గతంలో సీఎం జగన్ పాదయాత్ర సందర్భంగా పలువురు నేతలకు మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. స్ధానిక సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలుగా గెలవని వారికి, అవకాశాలు దక్కనివారికి కూడా మంత్రుల్ని చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. దీంతో వారంతా మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు సీనియార్టీ, ఇతర సమీకరణాలు కలిసొస్తున్నా తొలి విడతలో మంత్రులు కాలేకపోయినా వారు కోసం కేబినెట్ బెర్తుల కోసం ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈసారి కూడా కేబినెట్‌ ఆశావహుల సంఖ్య భారీగానే కనిపిస్తోంది.

  ఇదీ చదవండి: శనివారం అంటే భయం భయం.. తెల్లవారిదంటే టీడీపీ నేతలకు టెన్షన్.. ఎందుకో తెలుసా

  మంత్రులుగా ఎవరు సేఫ్?

  త్వరలో చేపట్టే కేబినెట్‌ విస్తరణలో ప్రస్తుతం ఉన్న మంత్రుల స్ధానంలో కొత్తగా అమాత్యులయ్యే వారిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే తొలి విడత కేబినెట్‌ విస్తరణ తర్వాత పిల్లిసుభాష్ చంద్రబోస్‌, మోపిదేవి ఎంపీలు కావడంతో మధ్యలో మంత్రులుగా వచ్చిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సిదిరి అప్పలరాజు స్థానాలు ప్రస్తుతానికి సేఫ్ అనే చెప్పాలి. వీరితో పాటు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, అనిల్‌ యాదవ్, కన్నబాబు, కొడాలి నాని, అవంతి శ్రీనివాస్‌, సుచరిత, బుగ్గన స్ధానాలు సేప్‌ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో రాజకీయ పరిస్థితులు.. సామాజిక సమీకరణాల లెక్కన వీరంతా సేఫ్ గా ఉన్నారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మిగిలిన వారి విషయంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

  ఇదీ చదవండి: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో నేనేం చేయలేను.. స్పష్టం చేసిన సీఎం జగన్

  ఆశావాహుల జాబితా పెద్దదే..

  అయితే ఈ సారి మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితా భారీగానే ఉంది. శిల్పా చక్రపాణిరెడ్డి, గ్రంథి శ్రీనివాస్‌, సామినేని ఉదయభాను, అంబటి రాంబాబు, వైవీ సుబ్బారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, తలారి వెంకట్రావు, కళావతి, ఉషశ్రీ చరణ్, కిలివేటి సంజీవయ్య, కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్న దొర, స్పీకర్‌ తమ్మినేని,  రోజా, పార్ధసారధి, జోగి రమేష్‌, తోట త్రిమూర్తులు, కాకాణి గోవర్ధన్‌రెడ్డి లాంటి వంటి వారు కూడా కేబినెట్‌ బెర్తుల కోసం పోటీలో ఉన్నారు.

  ఇదీ చదవండి:మంత్రి పుష్పశ్రీ వాణి కేబినెట్ నుంచి ఔట్..! ఆ ఎమ్మెల్యేకు గ్రీన్ సిగ్నల్.. కోలగట్ల పరిస్థితి ఏంటి?

  కేబినెట్‌ బెర్తు దక్కకపోతే జంప్‌ ?

  ప్రస్తుతం ఏపీ కేబినెట్ ఆశిస్తున్న వారిలో పలువురు తమకు అవకాశాలు దక్కుతాయని ఆశతో  ఉన్నారు. గతంలో ఇచ్చిన హామీల మేరకు తమకు బెర్తులు ఖాయమని ఆశిస్తున్నారు. అయితే సమీకరణాల పేరుతో తమను పక్కనబెడితే మాత్రం ఈ సారి పార్టీకి అంటీ ముట్టనట్టు వ్యవహరించడం.. ఎన్నికలకు ముందు వేరే పార్టీలోకి మారే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి, నిఘా నివేదికలు, పార్టీ నేతల నివేదికలు తెప్పించుకుని ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకూ పార్టీలో అసంతృప్తి లేదని భావిస్తున్న జగన్.. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల వ్యవహారం తర్వాత మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP cabinet, AP News, AP Politics

  ఉత్తమ కథలు