టెలికాం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్..

బకాయిల చెల్లింపును వాయిదా వేస్తున్నందునా.. సవరించిన మొత్తానికి సర్వీస్ ప్రొవైడర్స్ బ్యాంక్ గ్యారెంటీని అందించాలని కేబినెట్ సమావేశం అనంతరం నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

news18-telugu
Updated: November 21, 2019, 7:34 AM IST
టెలికాం కంపెనీలకు కేంద్రం బిగ్ రిలీఫ్..
నిర్మలా సీతారామన్ (ఫైల్ ఫొటో)
  • Share this:
ఓవైపు నష్టాలు,మరోవైపు అప్పులతో తీవ్ర సతమతమవుతోన్న టెలికాం కంపెనీలకు కేంద్రం నుంచి ఊరట లభించింది. ఇప్పటివరకు బకాయిపడ్డ రూ.1.47లక్షల కోట్ల చెల్లింపును 2022 వరకు వాయిదా వేసింది. బుధవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఆర్థిక అస్థిరత కారణంగా ఏ కంపెనీ మూతపడవద్దని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించిన కొద్దిరోజులకే టెలికాం కంపెనీలకు రిలీఫ్ ప్రకటించడం గమనార్హం. ఏ కంపెనీ మూతపడాలని తాము కోరుకోమని.. ప్రతీ కంపెనీ అభివృద్ది చెందాలనే కోరుకుంటామని గతంలో నిర్మలా సీతారామన్ చెప్పారు.

బకాయిల చెల్లింపును వాయిదా వేస్తున్నందునా.. సవరించిన మొత్తానికి సర్వీస్ ప్రొవైడర్స్ బ్యాంక్ గ్యారెంటీని అందించాలని కేబినెట్ సమావేశం అనంతరం నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వాయిదాల చెల్లింపుకు తాత్కాలికంగా విరామం ఇచ్చినా.. నిర్దేశించిన వడ్డీ యథాతథంగా వసూలు చేయబడుతుందన్నారు.కాగా,టెలికాం ఆపరేటర్లు దాదాపు రూ1.47లక్షల కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందని సమాచార మంత్రిత్వ శాఖ బుధవారం పార్లమెంటులో వెల్లడించింది. లైసెన్స్ ఫీజులతో పాటు స్పెక్ట్రమ్ వినియోగానికి గాను ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు చెప్పింది. మూడు నెలల్లోగా బకాయిలన్నీ చెల్లించాలని సెప్టెంబర్‌లో సుప్రీం ఇచ్చిన తీర్పు టెలికాం సంస్థల్లో ఆందోళన ఎక్కువైంది. ఎక్కడ సంస్థల్ని మూసివేయాల్సి వస్తుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్రం బకాయిల చెల్లింపును వాయిదా వేయడం వారికి ఊరట కలిగించింది.

కేంద్రం గనుక ఈ ప్రకటన చేయకపోయి ఉంటే వొడాఫోన్ లాంటి కంపెనీలు తమ సంస్థలను మూసుకోవాల్సి వచ్చేది.వొడాఫోన్,భారతి ఎయిర్‌టెల్ ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉండటంతో.. ఉన్నపలంగా బకాయిల చెల్లింపు సంస్థలపై తీవ్ర భారంగా పరిణమించేది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో వొడాఫోన్ రూ.50,921కోట్లు నష్టాన్ని చవిచూసింది. ఒక కార్పోరేట్ కంపెనీకి ఒక త్రైమాసికంలో వచ్చిన నష్టాల్లో ఇప్పటివరకు వొడాఫోన్‌దే అత్యధికం. అలాగే భారతి ఎయిర్‌టెల్ దాదాపు రూ.23,045కోట్లు నష్టాన్ని చవిచూసింది.

First published: November 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>