Home /News /politics /

IN FEW DAYS CM JAGAN MOHAN REDDY WILL EXPAND CABINET BUT MLAS DONT WANT MINSTER BERTH NGS GNT

AP Cabinet: ఆమ్మో మంత్రి పదవా నాకొద్దు బాబోయి.. ఎమ్మెల్యేలకు ఎందుకంత భయం

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

AP Cabinet Berths: పిలిచి మంత్రి పదవి ఇస్తాను అంటే ఎవరు వద్దంటారు.. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. మంత్రి పదవా మాకొద్దు బాబోయ్ అంటున్నారు కొందరు ఎమ్మెల్యేలు.. ఇంతకీ వారి భయానికి కారణం ఏంటి..?

  అన్నా రఘు న్యూస్ 18 ప్రతినిధి, అమరావతి.                           AP Cabient Berts:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుత మంత్రి వర్గానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)  పెట్టిన డెడ్ లైన్ పూర్తైంది.తదుపరి కూర్పులో మంత్రులు గా అందరూ కొత్తవారే వస్తారు.. తనతో  సహా పాత మంత్రులు మొత్తాన్ని తప్పిస్తారు అంటూ మత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చకి దారితీసింది. దసరాకి మంత్రివర్గ విస్తరణ, కొత్త మంత్రులకు దీపావళి కాంతులు పాత మంత్రులకు అమావస్య రాత్రులు" అంటూ అటు ప్రధాన మీడియా, ఇటు సోషల్ మీడియాలలో రకరకాల కథనాలు  వండివార్చారు. కరోనా వైరస్ మూలంగా ఈ రెండున్నర ఏళ్ళలో  తమ శాఖలపై పట్టు పెంచుకోవడానికే సమయం సరిపోలేదని,తీరా తమ శాఖలపై కొంత పట్టుదొరికింది అనుకునే సరికి పుణ్యకాలం కాస్త పూర్తయిందని ప్రస్తుత మంత్రులు మదనపడుతున్నారు. అటు అసలే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం గా ఉన్న ప్రస్తుత పరిస్థితులలో మంత్రి పదవులు తీసుకుని లేని పోని తలనొప్పులు కొనితెచ్చుకోవడం ఎందుకులే అని ఆశావహులు మిన్నుకుండిపోయారంట.

  మంత్రి పదవి తీసుకుని ఎర్రబుగ్గ కారులో తిరగడం తప్ప చేసేది ఏమీ లేదని.. అన్ని శాఖల మంత్రిగా వ్యవహిరిస్తున్న సజ్జల రామక్రిష్ణారెడ్డి  (Sajjala Ramakrishna Reddy)ని కాదని తాము చేసేది  ఏమి ఉండదని శాసనసభ్యులు చెవులు కొరుక్కుంటున్నారట. పైగా ఏ శాఖలోనూ నయాపైసా ఆదాయం లేదని, మంత్రిగా జిల్లా భాధ్యతలు,పార్టీ పై వచ్చే ఆరోపణలు ఖంఢించడం, తమ తమ శాఖలలో జరిగే అవినీతికి సంజాయిషీలు ఇచ్చుకొవడం వంటి బాధలు మనకెందుకులే అనుకుంటున్నారట చాలామంది శాసనసభ్యులు.

  ఇదీ చదవండి: అధికార వైసీపీలో పెరుగుతున్న వర్గ పోరు.. వైసీపీ సీనియర్ నేతలో అసంతృప్తి జ్వాల !

  ఇక జగన్ కూడా సంక్షేమ పథకాల (Welfare Schemes) అమలు కోసం అందిన కాడికి అప్పులు తెస్తుండటం తో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దివాళా వైపు పయనిస్తుందని, సీనియర్ల సలహాలకు విలువలేదని,జగన్ ప్రభుత్వంలో అంతా వన్ మ్యాన్ షో నడుస్తుందని ప్రతిపక్షాలు ఒక వైపు ఆరోపణలు గుప్పిస్తుంటే, ఖజానా ఆదాయం పెంచడం కోసం ప్రభుత్వం మోపుతున్న పన్నుల భారం,కరెంటు ఛార్జీల బాదుడు, మధ్యం ధరలు, ఇసుక పాలసీ వంటి అంశాలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచుతున్నాయని సీనియర్ నేతలు విస్వసిస్తున్నారు.

  ఇదీ చదవండి: అమ్మో జెల్లీ ఫిష్.. సాగర తీరంలో కలకలం.. టచ్ చేస్తే అంతే.. ఎందుకంత ప్రమాదం

  అదే జరిగితే ఇన్నాళ్ళూ మౌనంగా ఉన్న సీనియర్లు ప్రభుత్వ విధానాలపై స్వరం పెంచే అవకాలు లేక పోలేదని, ఈ పరిస్థితులలో తేనెతుట్టెలాంటి మంత్రి వర్గవిస్థరణ జోలికి పోతే లేని పోని తలనొప్పులు కొని తెచ్చుకున్నట్లు అవుతుందని జగన్ భయపడుతున్నాడని పార్టీ లోని కొందరు శాసనసభ్యులు భావన. మంత్రి పదవులు లేక పోతే బొత్స సత్యనారాయణ వంటి నేతలు పార్టీలో కొనసాగే అవకాశాలు కూడా ఉండవని,మరికొందరు శాసనసభ్యులను కలుపుకుని పార్టీ ఫిరాయించినా ఆశ్ఛర్యం లేదని, వీటన్నింటికీ భయపడే జగన్ ఇంతవరకు మంత్రివర్గ విస్థరణ జోలికి పోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP cabinet, AP News, AP Politics, Cm jagan

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు