Home /News /politics /

etela rajenderపై ప్రతీకారం! -cm kcr షాకింగ్ ట్విస్ట్ : సిట్టింగ్ ఎంపీకి ఎమ్మెల్సీ పదవి -trs mlc వీరే

etela rajenderపై ప్రతీకారం! -cm kcr షాకింగ్ ట్విస్ట్ : సిట్టింగ్ ఎంపీకి ఎమ్మెల్సీ పదవి -trs mlc వీరే

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంపికలో ట్బిస్ట్

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంపికలో ట్బిస్ట్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. నిన్న కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డిని ఎమ్మెల్సీ చేయడమే అనూహ్య పరిణామం అనుకుంటే, ఏకంగా సిట్టింగ్ ఎంపీని ఇప్పుడు ఎమ్మెల్సీగా పంపుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచిన ఈటల రాజేందర్ పై ప్రతీకారం తీర్చుకోవాలనే కాంక్షతోనే కేసీఆర్ ఈ సంచలనానికి పాల్పడినట్లు కామెంట్లు వస్తున్నాయి..

ఇంకా చదవండి ...
గుండెలు అరచేతుల్లో పెట్టుకుని పరుగెత్తడం.. ఏసీలోనూ ఒళ్లంతా చెమటలు పట్టడం.. భరించలేని టెన్షన్ కు మెదడులో నరాలు చిట్లిపోతున్నట్లు.. రేంజ్ కొంచెం అటు ఇటైనా తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ లో ఇవాళ కనిపించిన సీన్లు ఇవే. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు (mlc elections)లో నామినేషన్ల దాఖలుకు ఇవాళ(మంగళవారం) ఆఖరు రోజు కావడంతో ఎట్టకేలకు జాబితా విడుదలైందనుకునేలోపే అందులోని పేర్లు మారిపోయాయి.. అనూహ్య రీతిలో కొత్త పేర్లు వచ్చి చేరాయి.. అత్యంత ఆశ్చర్యకరంగా ఒక సిట్టింగ్ ఎంపీకి ఎమ్మెల్సీగా అవకాశమిస్తూ గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR) అందరినీ షాక్ కు గురి చేశారు..

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల్లో టెన్షన్ పీక్స్ కు చేరుస్తూ అధినేత కేసీఆర్ అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఎమ్మెల్యే కోటాలో మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా, టీఆర్ఎస్ సభ్యాబలంప్రకారం ఆ ఆరుగురూ ఏకగ్రీవంగానే మండలికి పోనున్నారు. అయితే జాబితా ప్రకటనలో మాత్రం కేసీఆర్ గతంలో ఎన్నడూ లేనంత హైడ్రామాను క్రియేట్ చేశారు. 24 గంటల కిందటే కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడమే హైలైట్ అనుకుంటే.. అంతకు మించిన షాకింగ్ నిర్ణయంగా.. టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ బండ ప్రకాశ్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు సీఎం కేసీఆర్..

cm kcr : జాక్‌పాట్ కొట్టిన మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, కౌశిక్ రెడ్డి -దళిత నేత ఎర్రోళ్లకు మొండిచేయి - trs mlc లిస్టు ఇదే


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మధుసూదనా చారి, పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, ఆకుల లలితతోపాటు వెంకట్రామిరెడ్డి ఎంపికయ్యారని, తెలంగాణ ఉద్యమకారుడైన దళిత నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ కు మొండిచేయే మిగిలిందని తొలుత వార్తలు వచ్చాయి. సదరు నేతలంతా అసెంబ్లీకి వెళ్లి నామినేషన్లు వేయబోతుండగా.. అనూహ్య రీతిలో బండ ప్రకాశ్ పేరు తెరపైకొచ్చింది. రాజ్యసభ ఎంపీ అయిన బండ ప్రకాశ్ కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్.. లిస్టులో నుంచి మధుసూదనాచారి పేరును డ్రాప్ చేశారు.

Etela Rajender ఆ పని చేయగలరా? -cm kcrకు షాకిచ్చేలా bjp సరికొత్త వ్యూహం ఇదే..


సిట్టింగ్ ఎంపీలకు ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించే విషయంలో బీజేపీ స్టైల్ ను ఫాలో అయిన సీఎం కేసీఆర్.. రాజ్యసభ ఎంపీ బండ ప్రకాశ్ కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఈ ఎంపిక వెనుక.. హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై ప్రతీకారం తీర్చుకోవాలనే కాంక్ష ఉన్నట్లు తెలుస్తోంది. ఈటల సామాజిక(ముదిరాజ్ లేదా ముత్రాసి) వర్గానికే చెందిన బండ ప్రకాశ్ ను ఎమ్మెల్సీగా చేయడంతోపాటు ఈటల రాజీనామాతో ఖాళీ అయిన మంత్రి పదవిని కూడా కట్టబెట్టాలని గులాబీ బాస్ యోచిస్టున్నట్లు సమాచారం. బండ ప్రకాశ్ రాజీనామాతో ఏర్పడనున్న ఖాళీలో మధుసూదనాచారిని రాజ్యసభ ఎంపీగా పంపబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా మధుసూదనాచారిని మండలి చైర్మన్ చేస్తారని ఉదయం వరకు ప్రచారం సాగగా, ఇప్పుడాయన ఎంపీ కాబోతున్నట్లు తెలుస్తోంది. నిజంగా ఎవరికి ఏ పదవి దక్కుతుందో నామినేషన్ల గడువు ముగిసేదాకా సస్పెన్స్ తప్పేలా లేదన్నట్లు పరిస్థితి కొనసాగుతోంది..
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Etela rajender, Mlc elections, Trs

తదుపరి వార్తలు