Home /News /politics /

IMRAN KHAN CLAIMS US THREATENED HIM AND WANTS HIM OUSTED AS PAKISTAN PM SB

Imran Khan: నాపై ఆ దేశం కుట్ర చేస్తోంది... రహస్య లేఖపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (ఫైల్)

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (ఫైల్)

తాను మాస్కోలో పర్యటించడం నచ్చక త‌న‌పై ఓ దేశం కుట్ర‌లు ప‌న్నింద‌ని అన్నారు, తనను గద్దె దింపేందుకు ప్రయత్నిస్తోందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.

    పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. పాక్ పార్లమెంట్ లో ఇమ్రాన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు.. అయితే తనపై అవిశ్వాస తీర్మానం పెట్టిన తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయనని ఇమ్రాన్ క్లియర్ గా చెప్పేశారు. అయితే అవిశ్వాసంతో ఇప్పుడు ఇమ్రాన్‌లో ఓ రకమైన టెన్షన్ కనిపిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అలాంటి సందేహాల్నే కలిగిస్తున్నారు. పాక్‌ను ఉద్దేశించి ఇమ్రాన్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. తనను గద్దె దింపేందుకు దింపేందుకు అమెరికా కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. అమెరికా గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ... ఓ దేశం నుంచి మెసేజ్ వచ్చిందని.. ఇమ్రాన్‌ను తొలగించాలని లేదంటే... ఆ తర్వాత వచ్చే పరిణామాల్ని పాకిస్తాన్ ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.

    నిజానికి అమెరికా తనపై కుట్ర పన్నిందని ఇమ్రాన్ ఓ రహస్య లేఖను ప్రస్తావిస్తూ ఆరోపించారు. పాకిస్థానీ దౌత్యవేత్త ఒకరు విదేశీ అధికారికి ఈ లేఖ రాశారని అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ఈ లేఖను అమెరికాలోని పాక్ మాజీ రాయబారి అసద్ మజిద్ ఖాన్ పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు పంపారు.. అసద్ మజిద్ ఖాన్‌తో ఓ శక్తిమంతమైన దేశానికి చెందిన సీనియర్ అధికారికి మధ్య జరిగిన సంభాషణలో భాగమే ఈ లేఖ అంటూ ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఉక్రెయిన్‌-ర‌ష్యా మ‌ధ్య యుద్ధం జ‌రుగుతోన్న నేప‌థ్యంలో తాను మాస్కోలో పర్యటించడం నచ్చక త‌న‌పై ఓ దేశం కుట్ర‌లు ప‌న్నింద‌ని అన్నారు. త‌న ప్ర‌సంగంలో ప‌రోక్షంగా అమెరికాపై ఆయ‌న ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ఇమ్రాన్ అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా గెలిచి, ఆయన ప్రభుత్వం చెక్కుచెదరకుండా ఉంటే, అప్పుడు పాకిస్థాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ విదేశీ అధికారి పాక్ అధికారికి చెప్పారన్నారు.

    పాకిస్థాన్‌లో త‌న ప్ర‌భుత్వం ప‌డిపోవాల‌ని కొన్ని విదేశీ శ‌క్తులు ప్ర‌య‌త్నిస్తున్నాయంటూ నిన్న పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ప‌లు ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఉక్రెయిన్‌-ర‌ష్యా మ‌ధ్య యుద్ధం జ‌రుగుతోన్న నేప‌థ్యంలో తాను మాస్కోలో పర్యటించడం నచ్చక త‌న‌పై ఓ దేశం కుట్ర‌లు ప‌న్నింద‌ని అన్నారు. త‌న ప్ర‌సంగంలో ప‌రోక్షంగా అమెరికాపై ఆయ‌న ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. అయితే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్న రహస్య లేఖపై న్యూస్ 18 స్పష్టం చేయలేకపోయినా... ఆయన చేసిన వ్యాఖ్యలపై మాత్రం అమెరికా స్పందించింది. పాక్‌ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం త‌మ‌కు లేదని అమెరికా పేర్కొంది. ఇమ్రాన్ చేసిన‌ ఆరోపణల్లో అర్థం లేదని శ్వేత‌సౌధం ఉన్నతాధికారి కేట్‌ బెడింగ్‌ఫీల్డ్ చెప్పారు. తనను అధికారం నుంచి దింపేయాలని అమెరికా ప్రయత్నిస్తోందంటూ ఇమ్రాన్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు.

    పాకిస్థాన్‌ రాజ్యాంగం, అక్క‌డి చట్టాలపై అమెరికాకు గౌరవం ఉందని చెప్పారు. పాకిస్థాన్‌లోని పరిస్థితులను తాము ఎప్పటికప్పుడు ప‌రిశీలిస్తున్నామ‌ని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్య‌ల‌పై తాము ఇంత‌కుమించి స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. కాగా, ఇమ్రాన్ ఖాన్ ప్ర‌భుత్వం ప‌త‌నం అంచున ఉన్న నేప‌థ్యంలో నిన్న జాతినుద్దేశించి ఇమ్రాన్ ఖాన్ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ఆ స‌మ‌యంలో భార‌త్ పై కూడా ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు.

    పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్‌పై.. 2022 ఏప్రిల్ 3న అవిశ్వాసంపై ఓటింగ్ జరగాల్సి ఉంది. అయితే మెజారిటీ నిరూపించుకునేందుకు ఇమ్రాన్‌కు 172 ఓట్లు రావాల్సి ఉంటుంది. మరోవైపు ఆయనకు 175 మంది ఎంపీల మద్దతు ఉంది.. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ వెంటనే అధికార పీఠాన్ని వీడాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. అయితే పాక్‌లో ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేయలేదు.అలాగే అవిశ్వాస తీర్మానం సవాల్‌ను ఎదుర్కొంటున్న పాకిస్థాన్ చరిత్రలో ఇమ్రాన్ ఖాన్ మూడో ప్రధాని.. కావడం విశేషం.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: America, Imran khan, Pakistan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు