2019లో సుప్రీంకోర్టు అనేక సంచలనాత్మక తీర్పుల్ని ఇచ్చింది. అయోధ్య వివాదాస్పద భూమితో పాటు... ఆర్టీఐ పరిధిలోకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం లాంటి కేసుల్లో చరిత్రాత్మక తీర్పులను ప్రకటిస్తూ వచ్చింది. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ 17న రాజీనామా చేశారు. తాను పదవీవిరమణ చేయబోయే ముందు అయోధ్య భూవివాదం కేసుతో సహా శబరిమల, ఆర్టీఐ పరిధిలోకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం వంటి ఎన్నో సంచలనాత్మక కేసులతో పాటు.. సున్నితమైన అంశాలపై కూడా న్యాయస్థానం తీర్పులను వెలువరించింది. అంతేకాదు రాఫెల్ వివాదంలో కూడా తీర్పులు ఇచ్చారు. ఒకసారి 2019లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన జడ్జీమెంట్లను పరిశీలిస్తే....

న్యూస్18 క్రియేటివ్
Ayodhya Verdict 2019 : నవంబర్ 9, 2019అయోధ్య కేసులో తీర్పు భారత్‌నే కాదు... యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. తీర్పును చదివేటప్పుడు... కాసేపు హిందువులకు, కాసేపు ముస్లింలకు... ఇలా రకరకాల మలుపులు తిప్పారు. నవంబర్ 9న అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. ముస్లీంలకు ప్రత్యామ్నాయంగా మరో చోట స్థలాన్ని కేటాయించాలంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాదాస్పద స్థలాన్ని రామ జన్మభూమి న్యాస్‌కు అప్పగిస్తున్నట్లు పేర్కొంది. మూడు నెలల్లో అయోధ్య ట్రస్టును ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయోధ్యలో ఐదెకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని పేర్కొంది. అయితే ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముస్లీం పార్టీలు తిరిగి రివ్యూ పిటిషన్ వేశాయి.

Ayodhya: అయోధ్యపై తీర్పు వచ్చింది... అయోధ్యకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న మరో కేసు ఇది
(image: News18 Creative)
RTA పరిధిలోకి సీజేఐ: ఈ ఏడాది సుప్రీంకోర్టు మరో ల్యాండ్‌మార్క్ జడ్జిమెంట్‌ను కూడా ఇచ్చింది. నవంబర్ 13న మరో కీలక తీర్పును ఇచ్చింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. పారదర్శకత పేరుతో న్యాయవ్యవస్థను ధ్వంస చేయలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పారదర్శకతను కొనసాగించడం వల్ల న్యాయవ్యవస్థకు భంగం వాటిల్లదని చెప్పింది. కేసును విచారణను చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చేపట్టింది. జస్టిస్ రంజన్ గొగోయ్‌తో పాటు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్ , జస్టిస్ దీపక్ గుప్తా మరియు జస్టిస్ సంజీవ్ ఖన్నాలు సభ్యులుగా ఉన్నారు. ఈ తీర్పు అప్పటి చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రావడం విశేషం. అప్పట్లో సీజేగా ఉన్న కేజీ బాలకృష్ణన్ జడ్జీలకు సంబంధించిన సమాచారం వెల్లడించరాదని అది ఆర్టీఐ పరిధిలోకి రాదని తీర్పు చెప్పారు.

జస్టిస్ రంజన్ గొగోయ్
రాఫెల్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు: ఇక
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. రాఫెల్ యుద్ధ విమానాల ధరలపై విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ‘ఈ ప్రక్రియలో అనుమానించాల్సిన కోణం ఏదీ లేదు. ఇది ఉమ్మడి కార్యాచరణ. ఆర్ధిక లబ్ధి చేకూర్చిన దాఖలాలు కనిపించడంలేదు..’అని సీజేఐ గొగోయ్ పేర్కొన్నారు. రాఫెల్ ఒప్పందాన్ని లోతుగా పరిశీలన చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. యుద్ధ విమానాల ధరలను విచారించడం కోర్టు పని కాదని జస్టిస్ గొగోయ్ అన్నారు.
రాహుల్ గాంధీకి సుప్రీం మొట్టికాయలు: రఫేల్ యుద్ధవిమానాల ఒప్పందంపై గత ఏడాది ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఏప్రిల్ 10న ఉత్తర్వులిచ్చింది. దీంతో చౌకీదార్ చోర్ అని ఈ తీర్పు స్పష్టం చేస్తుందంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. అయితే కోర్టు తీర్పుపై రాహుల్ తప్పుగా వ్యాఖ్యానించారంటూ భాజపా నేత మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. రఫేల్ తీర్పులో తాము ఎక్కడా అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, వాటిని తప్పుగా తమకు ఆపాదించారని స్పష్టం చేసింది. దానిపై వివరణ ఇవ్వాలని రాహుల్‌ను ఆదేశించింది.

రాహుల్ గాంధీ
శబరిమల కేసు మరో బెంచ్‌కు బదిలీ : శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై మాత్రం న్యాయమూర్తుల మధ్య బేధాభిప్రాయాలు నెలకొన్నాయి. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశాన్ని కల్పించడానికి ఉద్దేశించిన రివ్యూ పిటీషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం తన తుది తీర్పును పెండింగ్ లో ఉంచింది. దీనిపై మరింత విస్తృత పరిశీలన అవసరమని ఐదుగురు సభ్యుల ధర్మాసనం అభిప్రాయ పడింది. నవంబర్ 14న ఈ కేసును ఏడుమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పరిశీలనకు బదిలీ చేసింది. అయితే 2018లో ఇచ్చిన తీర్పుపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు కానీ స్టే ఇస్తున్నట్లుగానీ సుప్రీంకోర్టు చెప్పలేదు. మొత్తం ఐదుగురు న్యాయమూర్తుల్లో ముగ్గురు జడ్జీలు అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించడాన్ని సమర్థించగా మరో ఇద్దరు దీన్ని తిరస్కరించారు.

న్యూస్ 18 క్రియేటివ్