ఓటు వేసి రాజులవుతారో.. అమ్ముకుని బానిసలవుతారో మీ ఇష్టం...

రాజ్యాంగం ఇచ్చిన ఇంతటి సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసి ఆ స్వాతంత్య్రానికీ సార్థకత తెచ్చుకోవడం మన చేతుల్లోనే ఉంది.

news18-telugu
Updated: December 6, 2018, 8:53 PM IST
ఓటు వేసి రాజులవుతారో.. అమ్ముకుని బానిసలవుతారో మీ ఇష్టం...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: December 6, 2018, 8:53 PM IST
ఓటు.. పేద, ధనిక తేడా లేకుండా అందరూ వినియోగించుకునే ఓ అద్భుత అవకాశం.. ఈ అధికారంతో ఏమీ చేయని.. ఎంత పెద్ద నాయకుడినైనా గద్దె దించొచ్చు.. సమాజానికి మంచి చేసే.. అన్ని తెలిసిన సామాన్యుడిని సమరంలో గెలిపించొచ్చు. ఐదేళ్లకోసారి వచ్చే ఈ సువర్ణావకాశాన్ని అడ్డమైన సాకులతో ఆపొద్దు. అరగంటైనా.. ఆరుగంటలైనా సమయం కేటాయించి భవిష్యత్‌ని బంగారుమయం చేసుకునేందుకు పాటుపడాలి. ఇలా ప్రతీఒక్కరూ అనుకోవాలి.
సమాజం నాకేమిచ్చిందని ఓటుని నిర్లక్ష్యం చేసేముందు.. మన గుర్తింపుకోసం వాడుకునే ఓటర్ ఐడీ కార్డుని చూడండి.. అప్పుడైనా ఆలోచనలు మారుతాయో గమనించండి. ఇష్టమైన హీరో, హీరోయిన్ల సినిమాల కోసం, సండే సమయాన్ని ఎంజాయ్ చేసేందుకు పడే ఆరాటంలో పదిశాతాన్నైనా ఓటు వేయడంలో చూపించండి..
సమాజంలోని చెడు మనం ఒక్కరమే తొలగించగలమా అనుకునే బదులు.. నేను సైతం.. నా ఓటు సైతం అనే సంకల్పాన్ని ప్రతిఒక్కరూ కలిగి ఉండాలి.
పెట్రోల్ రేటు పెరిగింది, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి, రోడ్లు సరిగ్గా లేవంటూ రోజూ దిగులు పడే బదులు.. ఐదేళ్లకోసారి మనకుండే కనీస బాధ్యతని నిర్వర్తించడం మేలు కదా..

ఒక్కరోజు ఓటు వేస్తే నా పనులు ఏమవుతాయని బాధపడేవారు.. ఒక్కసారి సెలబ్రిటీలను కూడా చూడండి.. వేలకోట్ల విలువచేసే ప్రాజెక్ట్స్, పనులను పక్కన పెట్టి మేము ఓటు వేస్తాం, వేశాం.. మీరూ వేయండంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లు చూడండి.. ఈ విషయంలో వారిని మించిన గొప్పవారు లేరనిపిస్తుంది..
అయినా.. మన కర్తవ్యంలా భావించే పనిని కూడా ఖర్మరా అని భావించడం ఏంటి? పనిచేయని వాడికి తినే హక్కులేదని చెప్పినట్లు.. ఓటు వేయని వాళ్లకు సమాజంలో జరిగే తప్పులను ప్రశ్నించే అధికారం లేదు..

రాజ్యాంగం ఇచ్చిన ఇంతటి సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసి ఆ స్వాతంత్య్రానికీ సార్థకత తెచ్చుకోవడం మన చేతుల్లోనే ఉంది.
Loading....


అందుకే ఓటు నా జన్మహక్కు అని ప్రతిఒక్కరూ అనుకోండి.. ఓట్లు వేయండి.. సమాజ రూపకల్పనకు బంగారుబాటలు వేయండి..
First published: December 6, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు