news18-telugu
Updated: November 16, 2019, 5:07 PM IST
ఆత్మకూరు పరిధిలోని సర్వే నెంబర్ 392లో ఉన్న 3.65 ఎకరాల వాగు పోరంబోకు భూమని, ఆ భవనాన్ని కూల్చివేసి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆర్కే కోర్టును కోరారు.
ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నారు కాబట్టే.. చంద్రబాబునాయుడుకి ప్రతిపక్ష హోదా కూడా మిగిలిందన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన కొడాలి నాని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద పలు వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘చంద్రబాబు టైం అయిపోయింది. ఆయన వెయ్యి జన్మలు ఎత్తినా సీఎం కాలేరు. జగన్ కట్టుబాటు పెట్టుకున్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఉంది. జగన్ చిటికేస్తే ప్రతిపక్ష హోదా కూడా రాదు. టీడీపీ ఆఫీసు తీసుకొచ్చి వైసీపీ ఆఫీసులోని స్టోర్‌రూమ్‌లో పెట్టిస్తాం. ప్రతిపక్ష నేత కూడా జగన్ వెనుక అన్నా.. అన్నా అని తిరుగుతాడు.’ అని కొడాలి నాని అన్నారు.

గన్ ఎక్కుపెట్టిన కొడాలి నాని (FIle)
టీడీపీలో సంక్షోభం నారా లోకేష్ వల్ల ఏర్పడిందని కొడాలి నాని అన్నారు. దానిపై పార్టీలో తిట్టుకుంటారో, కొట్టుకుంటారో వారి ఇష్టమన్నారు. అయితే, దాన్నుంచి ప్రజలను దృష్టి మళ్లించడానికి ఇసుక దీక్షల పేరుతో చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొన్ని రోజులు చంద్రబాబు ఇలాగే మాట్లాడితే ప్రజలు చంద్రబాబును ఇంటికొచ్చి కొడతారని నాని హెచ్చరించారు.

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం
చంద్రబాబు దీక్ష చేస్తే పార్టీలోని 23 మందిలో కేవలం 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు మీద ఆ పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదన్నారు. ఎన్టీఆర్ చావుకు కారణమైన చంద్రబాబుకు కూడా అదే రాసిపెట్టి ఉందని కొడాలి నాని అన్నారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 16, 2019, 5:06 PM IST