వైసీపీ నేతలు హిందూపురం జిల్లా తెస్తే... తాను ఏం చేస్తానో చెప్పిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది.

 • Share this:
  తెలుగుదేశం పార్టీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో హిందూపురంను జిల్లాగా ఏర్పాటు చేస్తే తాను కూడా పట్టణానికి క్యాన్సర్ ఆస్పత్రి తీసుకొస్తానని బాలయ్య ప్రకటించారు. తాను అధికారంలోకి వస్తే ఏపీలో పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అందుకు తగినట్టే కొన్ని నెలల క్రితం కొత్త జిల్లాల ఏర్పాటు కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఏపీలో ప్రస్తుతం 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. హిందూపురం కూడా లోక్ సభ నియోజకవర్గమే. దీంతో హిందూపురం కూడా జిల్లా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే, విశాఖలో అరకును మాత్రమే రెండు జిల్లాలుగా మార్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

  ఏపీలో మున్సిపల్ ఎన్నికలు రావడంతో బాలయ్య కూడా ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీకి మద్దతుగా ఉన్న హిందూపురం కంచుకోట చేజారిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా, బాలయ్య తన అభిమాని చెంప చెళ్లుమనిపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బాలయ్య తన అభిమాని చెంపపై చేయి చేసుకోవడం మరోసారి వైరల్ అయ్యింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. దీనిపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయ్యింది. అయినా ఆయన ఆవేశం తగ్గడం లేదు. బాలయ్య కొన్ని రోజుల నుంచి ప్రచారంలో బిజీగా ఉన్నారు.

  ఒక్క వార్డు కూడా ఏకగ్రీవం కాకుండా చూసుకుంటూ ప్రచారంలో అన్నీ తానై దూసుకుపోతున్నారు.. అంతా సవ్యంగా సాగుతోంది. అనుకున్న సమయంలో మరోసారి క్షణికావేశంలో బాలయ్య రెచ్చిపోయారు. మున్సిపల్ ప్రచారంలో భాగంగా 9వ వార్డు అభ్యర్థిని ఇంటికి వెళ్లారు బాలకృష్ణ. ఇంట్లో కార్యకర్తలతో మాట్లాడుతుండగా.. ఓ అభిమాని వీడియో తీశాడు. అది గమనించిన బాలయ్య ఆవేశంతో ఊగిపోయారు. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ అభిమాని చెంప చెళ్లుమనిపించారు. వెంటనే ఆ వీడియో డిలీట్ చేయంటూ వార్నింగ్ ఇచ్చారు. అక్కడున్న వారు కూడా బాలయ్య కోపాన్ని కంట్రోల్ చేయలేక చూస్తూ ఉండిపోయారు. ఆ అభిమానికే.. వీడియో డిలీట్ చేయాలి అంటూ సర్ధి చెప్పుకున్నారు.

  ఆ వీడియో వైరల్ కావడంతో బాలయ్య వ్యవహార శైలిపై విమర్శలు వచ్చాయి. ఐతే బాలయ్య చెంపదెబ్బలపై అభిమాని స్పందించాడు. తనపేరు సోము అని.. తాను బాలయ్యకు వీరాభిమానిని అని చెప్పాడు. హిందూపురంలో బాలకృష్ణ ఉదయం నుంచి రాత్రివరకు ప్రచారం చేస్తున్నారని.. ఆయన అలసిపోయారన్నాడు. అంతేకాదు తన అన్న ఇంటికి ప్రచారానికి వచ్చిన సమయంలో ఎవరో బయటివ్యక్తి అనుకొని తనను పక్కకు నెట్టేసినట్లు తెలిపాడు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: