• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • IF YS JAGAN ASKS I WILL CAMPAIGN FOR YSRCP SAYS ASADUDDIN OWAISI BA

ఏపీలో జగన్ తరఫున ప్రచారానికి కండిషన్ పెట్టిన అసదుద్దీన్ ఒవైసీ

ఏపీలో జగన్ తరఫున ప్రచారానికి కండిషన్ పెట్టిన అసదుద్దీన్ ఒవైసీ

జగన్, అసదుద్దీన్ ఓవైసీ ( ఫైల్ ఫోటో )

గతంలో ‘చంద్రబాబూ.. ఐ యామ్ కమింగ్’ అని ప్రకటించిన అసదుద్దీన్ ఇప్పుడు జగన్ అడిగితే ప్రచారం చేస్తా అనడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

  • Share this:
    వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడిగితే ఏపీలో ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తానని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గతంలో ‘చంద్రబాబూ.. ఐ యామ్ కమింగ్’ అని ప్రకటించిన అసదుద్దీన్ ఇప్పుడు జగన్ అడిగితే ప్రచారం చేస్తా అనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీ, తెలంగాణలో కలపి టీఆర్ఎస్, వైసీపీ 35 ఎంపీ సీట్లు సాధిస్తే కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయమని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 16 ఎంపీ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ 19 ఎంపీ సీట్లు సాధిస్తే చాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను భూస్థాపితం చేయాలని అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని దారుసలాంలో ఎంఐఎం 61 ఆవిర్భావ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు.

    ys jagan, ys jagan mohan reddy, ys jaganmohan reddy, ys jagan mohan reddy latest news, వైఎస్ జగన్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ జగన్ లేటెస్ట్ న్యూస్, asaduddin owaisi, asaduddin owaisi speech, owaisi, asaduddin owaisi on surgical strike, asaduddin owaisi on modi, asaduddin owaisi on YS Jagan, Owaisi AP tour, Owaisi AP Politics, అసదుద్దీన్ ఒవైసీ, అసదుద్దీన్ ఒవైసీ స్పీచ్, ఒవైసీ, అసదుద్దీన్ ఒవైసీ సర్జికల్ స్ట్రైక్, అసదుద్దీన్ ఒవైసీ నరేంద్ర మోదీ, అసదుద్దీన్ వైఎస్ జగన్, అసదుద్దీన్ ఏపీ టూర్, అసదుద్దీన్ ఒవైసీ చంద్రబాబునాయుడు
    అసదుద్దీన్ ఓవైసీ, చంద్రబాబు


    ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఏపీకి వెళ్లి ప్రచారం చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ‘చంద్రబాబూ.. ఐ యామ్ కమింగ్’ అంటూ ప్రకటన చేశారు. దీంతో కేసీఆర్, జగన్, అసదుద్దీన్ అంతా కలసి ఏపీలో టీడీపీని ఓడించేందుకు ఒక్కటయ్యారనే అభిప్రాయం నెలకొంది.
    First published: