Home /News /politics /

IF VILLAGE SECRETARIATE CONCEPT IS CHANDRABABUS BRAIN CHILD WHY HE CANNOT IMPLEMENTS QUESTIONED BY BOTSA SATYANARAYANA MS

ఆ ఆలోచన చంద్రబాబుకు వస్తే ఎందుకు అమలు చేయలేదు : బొత్స

చంద్రబాబు, బొత్స సత్యనారాయణ(File)

చంద్రబాబు, బొత్స సత్యనారాయణ(File)

టీడీపీ అనుసరించిన ఆర్థిక విధానాలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంటు పడటానికి కారణమని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. త్వరలోనే 110 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.

    గ్రామ సచివాలయాల కాన్సెప్ట్ చంద్రబాబుదే అన్న టీడీపీ నేత బాబు రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలను మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. ఆ ఆలోచన చంద్రబాబుదే అయితే.. ఎందుకు అమలుచేయలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఒక్క మున్సిపల్ శాఖలోనే రూ.15వేల కోట్లు అప్పు ఉందన్నారు. టీడీపీ అనుసరించిన ఆర్థిక విధానాలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంటు పడటానికి కారణమని ఆరోపించారు. త్వరలోనే 110 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.

    హాస్పిటల్స్ ఉన్న ప్రాంతాల్లో రాజన్న క్యాంటీన్ల ఏర్పాటుకు కసరత్తులు చేస్తున్నామని చెప్పారు.రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్న మాట వాస్తవమేనని.. బొగ్గు కొరతనే దీనికి కారణమన్నారు. ఆ సమస్యను అధిగమించేందుకు కేంద్రంతోను,పొరుగు రాష్ట్రాలతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీతో ఇసుక కొరత తగ్గిందన్నారు.ఇక వైసీపీ ప్రభుత్వం ఒక మతాన్నే ప్రోత్సహిస్తోందని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. ఆ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పుకొచ్చారు.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: Andhra Pradesh, Botsa satyanarayana, Village secretariat, Village Secretariat Exams, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు