రాహుల్ ప్రధాని అయితేనే.. ఏపీకి ప్రత్యేక హోదా: వీహెచ్

తెలంగాణకు ఇచ్చిన హామీల సాధన విషయంలో కూడా మనం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు వీహెచ్. ఆంధ్రా అవినీతి గురించి మాట్లాడుతున్న మోదీకి తెలంగాణలో కుటుంబ పాలన కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 11, 2019, 3:36 PM IST
రాహుల్ ప్రధాని అయితేనే.. ఏపీకి ప్రత్యేక హోదా: వీహెచ్
వి హనుమంతరావు(ఫైల్ ఫోటో..)
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 11, 2019, 3:36 PM IST
ఆంధ్రాలో అవినీతి గురించి మాట్లాడుతున్న మోదీకి తెలంగాణలో అవినీతి కనపడటం లేదా అని ప్రశ్నించారు ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వీహెచ్. మోదీ... కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడరన్నారు. తెలంగాణకు విభజన హామీల్ని ఎందుకు మోదీ అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ ప్రధాని అయితే ఏపీకి ప్రత్యేక హోదా...తెలంగాణకు విభజన హామీలు అమలవుతాయన్నారు.

చంద్రబాబు ఢిల్లీలో ఈ రోజు ప్రత్యేక హోదా కోసం ధర్నా చేపట్టారన్నారు వీహెచ్. తెలంగాణకు ఇచ్చిన హామీల సాధన విషయంలో కూడా మనం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రా అవినీతి గురించి మాట్లాడుతున్న మోదీకి తెలంగాణలో కుటుంబ పాలన కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ గతంలో చెప్పిన డబుల్ బెడ్ రూమ్ అంశంలో మొదట స్పందించాలన్నారు. తెలంగాణ వస్తే మోడీ కేసీఆర్ అవినీతిపై కూడా మాట్లాడాలన్నారు....లేదంటే మోడీ పక్షపాత వైఖరి వ్యవహరించినట్టేనని ఆరోపించారు. కేబినెట్ లేకుండా ప్రభుత్వం నడిపిస్తున్న కేసీఆర్.. తనకు అర్థమవ్వడం లేదన్నారు వీహెచ్. ప్రజలపై అనవసర టాక్స్‌లు వేసి ప్రజల నడ్డి విరగ్గొడుతున్నారని విమర్శించారు.

భారత దేశానికి చౌకి దార్ అన్న మోడీ తెలంగాణ ,ఆంద్రప్రదేశ్ కూడా భారత దేశంలో భాగమేనని గుర్తించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తానన్న ప్రత్యేక హోదా ఏమైందని ప్రశ్నించారు. తిరుపతి సాక్షిగా మోడీ ఇచ్చిన మాట ఏమైందన్నారు. ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్షలో రాహుల్ పాల్గొన్నందుకు ఏపీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. హైకమాండ్ టికెట్ ఇస్తే ఖమ్మం ఎంపీగా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు వీహెచ్.

గ్యాలరీ: లక్నోలో రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక గాంధీ మెగా రోడ్ షో..First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...