మోదీకో న్యాయం, చంద్రబాబుకో న్యాయమా?.. టీడీపీ ‘లా పాయింట్’

మోదీ కూడా కోడ్ అమల్లో ఉన్న సమయంలో కీలక ప్రకటన చేశారని, ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితుల మీద చంద్రబాబు సమీక్ష చేస్తే తప్పేంటని వాదిస్తోంది.

news18-telugu
Updated: April 20, 2019, 5:42 PM IST
మోదీకో న్యాయం, చంద్రబాబుకో న్యాయమా?.. టీడీపీ ‘లా పాయింట్’
చంద్రబాబు, నరేంద్రమోదీ
news18-telugu
Updated: April 20, 2019, 5:42 PM IST
ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షలు నిర్వహించడం పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో చంద్రబాబు ఎలా సమీక్షలు జరుపుతారని ఎన్నికల కమిషన్, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ ఈ అంశంలో అధికారులకు నోటీసులు కూడా పంపింది. ఆ సమీక్షకు హాజరైన వారికి కూడా నోటీసులు వచ్చినట్టు సమాచారం. ప్రతిపక్ష వైసీపీ కూడా చంద్రబాబు సమీక్షల మీద విమర్శలు గుప్పించింది. దీంతో చంద్రబాబు హోంశాఖ సమీక్షను రద్దు చేసుకున్నారు. అయితే, అంతకు ముందు జరిపిన పోలవరం, సీఆర్డీఏ సమీక్షల మీద మొదలైన రచ్చ కంటిన్యూ అవుతోంది.

ఈ సమయంలో ప్రతిపక్షాన్ని, అటు ఎన్నికల కమిషన్‌ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు ఓ పాయింట్‌ను బయటకు తీసుకొచ్చారు. మార్చి 10న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయితే, మార్చి 27న ప్రధాన మంత్రి ‘మిషన్ శక్తి’కి సంబంధించి ఓ ప్రకటన చేశారు. అంతరిక్షంలో శాటిలైట్లను పేల్చివేసే ‘మిషన్ శక్తి’ని విజయవంతంగా ప్రయోగించినట్టు ప్రకటించారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది. మోదీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే, అది కోడ్‌ను ఉల్లంఘించడం కిందకు రాదని ఈసీ నియమించిన కమిటీ తేల్చింది.

ఇప్పుడు టీడీపీ కూడా అదే వాదనను లేవనెత్తింది. మోదీ కూడా కోడ్ అమల్లో ఉన్న సమయంలో కీలక ప్రకటన చేశారని, ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితుల మీద చంద్రబాబు సమీక్ష చేస్తే తప్పేంటని వాదిస్తోంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం నడవడం లేదని, పూర్తిస్థాయి ప్రభుత్వమే కొనసాగుతుందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల కమిషన్ కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...