జగన్, విజయసాయిరెడ్డి ఫర్నీచర్ దొంగలే.. చంద్రబాబు సంచలన ఆరోపణలు

సీఎం జగన్ ఇంట్లో ఉన్న ఫర్నీచర్, ఢిల్లీలో విజయసాయిరెడ్డి ఇంట్లో ఉన్న ఫర్నీచర్ కూడా ప్రభుత్వం ఇచ్చిందేనని చంద్రబాబు అన్నారు.

news18-telugu
Updated: September 19, 2019, 3:39 PM IST
జగన్, విజయసాయిరెడ్డి ఫర్నీచర్ దొంగలే.. చంద్రబాబు సంచలన ఆరోపణలు
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. కోడెల ఇంట్లో ఉన్నది దోచుకున్న ఫర్నీచర్ అయితే, సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్లో ఉన్నది కూడా దోచుకున్న ఫర్నీచరేనా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కోడెల ఆత్మహత్యకు దారితీసిన పరిణామాలు, రాష్ట్రంలో శాంతిభద్రతలు, టీడీపీ నేతల మీద కేసులపై గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్‌ను టీడీపీ బృందం కలసి ఫిర్యాదు చేసింది. చంద్రబాబు, మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. 13 పేజీల నివేదికను గవర్నర్‌కు అందించారు.

‘కోడెల మీద కేసులు పెట్టి వేధించారు. ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రభుత్వం పురిగొల్పింది. మంత్రులు, స్పీకర్, చీఫ్ విప్‌లకు ప్రభుత్వం ఫర్నీచర్ ఇస్తుంది. పదవీకాలం అయిపోయాక ప్రైవేట్ సెక్రటరీ అవన్నీ ప్రభుత్వానికి సరెండర్ చేస్తారు. అది పీఎస్ బాధ్యత. అయినా, జూన్ 7, జూన్ 20న రెండు సార్లు అసెంబ్లీ సెక్రటరీకి, స్పీకర్‌కు కోడెల లేఖ రాశారు. ఫర్నీచర్ తీసుకెళ్లాల్సిందిగా కోరారు. కానీ, జూన్ 24న తప్పుడు కేసు పెట్టారు. ప్రభుత్వమే ఫర్నీచర్ ఇచ్చింది. దాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. కానీ, కోడెలను వేధించారు. మూడు నెలల్లో 18 కేసులు పెట్టారు. అందులో కొన్నింటిలో ఏ2గా శివప్రసాదరావు పేరు పెట్టి వేధించారు’ అని చంద్రబాబు మండిపడ్డారు.

ఇప్పుడు సీఎం జగన్ ఇంట్లో ఉన్న ఫర్నీచర్, ఢిల్లీలో విజయసాయిరెడ్డి ఇంట్లో ఉన్న ఫర్నీచర్ కూడా ప్రభుత్వం ఇచ్చిందేనని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు వారిపై కూడా దొంగ ఫర్నీచర్ వాడుకున్నట్టు కేసులు పెడతారా? అని చంద్రబాబు నిలదీశారు.
First published: September 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading