జగన్ అలా చేస్తే.. ఏపీలో రాష్ట్రపతి పాలనే : యనమల హెచ్చరిక

యనమల వాదన ఇలా ఉంటే.. జగన్ సర్కార్ వాదన మాత్రం మరోలా ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. విద్యుత్ కొనుగోళ్ల భారం అధికమైనప్పుడు.. కేంద్రం కూడా గతంలో పీపీఏలను సవరించుకుందని గుర్తుచేస్తున్నారు.

news18-telugu
Updated: July 19, 2019, 2:30 PM IST
జగన్ అలా చేస్తే.. ఏపీలో రాష్ట్రపతి పాలనే : యనమల హెచ్చరిక
వైఎస్ జగన్, యనమల రామకృష్ణుడు..(ఫైల్ ఫోటోలు)
  • Share this:
పీపీఏల విషయంలో సమీక్షలపై జగన్ తన వైఖరిని మార్చుకోకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి  పాలన విధించేందుకు అవకాశం ఉందంటున్నారు మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు.కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేస్తే ఆర్టికల్-257 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించే అధికారం కేంద్రానికి ఉందని ఆయన గుర్తుచేశారు. కాబట్టి కేంద్రం ఎందుకు ఆ సూచన చేసిందో అర్థం చేసుకోవాలన్నారు. పీపీఏ వ్యవహారంతో దేశ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని చెప్పారు.

యనమల వాదన ఇలా ఉంటే.. జగన్ సర్కార్ వాదన మాత్రం మరోలా ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. విద్యుత్ కొనుగోళ్ల భారం అధికమైనప్పుడు.. కేంద్రం కూడా గతంలో పీపీఏలను సవరించుకుందని గుర్తుచేస్తున్నారు. కాబట్టి తామూ అలాగే ముందుకెళ్తామని.. గతంలో జరిగిన పీపీఏలను సవరిస్తామని చెబుతున్నారు. విద్యుత్ కొనుగోళ్ల భారంతో డిస్కం సంస్థల ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని.. కాబట్టి సమీక్ష తప్పదని చెబుతున్నారు.
మొత్తంగా పీపీఏల విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ.. ప్రతిపక్ష టీడీపీ వాదన ఒకేలా ఉన్నాయి.పీపీఏ సమీక్షల విషయంలో ఒకవేళ జగన్ వెనుకడుగు వేస్తే టీడీపీ పైచేయి సాధించినట్టవుతుంది.కాబట్టి అటు కేంద్రంతో చెడకుండా.. ఇటు టీడీపీని మాత్రమే ఇరుకున పెట్టేలా జగన్ ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. చూడాలి మరి.. ఈ విషయంలో జగన్ వైఖరి మున్ముందు ఎలా ఉండబోతుందో..!

First published: July 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...