IF ELECTIONS BEFORE IN ANDHRA PRADESH WE WILL GET 160 MORE PLUS SEATS TDP STATE PRESIDENT ATCHANNAIDU SAID NGS
AP politics: ఏపీలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు.. టీడీపీకి వచ్చే స్థానాలు ఇవే అంటూ సంచలన వ్యాఖ్యలు
ప్రతీకాత్మకచిత్రం
AP politics: ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయా..? సీఎం జగన్ అదే ఆలోచనలో ఉన్నారా.. ? ముందుగానే ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? దీనిపై ఎవరి లెక్కలు వారికి ఉండొచ్చు.. కానీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాత్రం.. టీడీపీ 160 సీట్లు వస్తాయి అంటున్నారు.
Andhra Pradesh Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అప్పుడే ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. లెక్క ప్రకారం చూస్తే.. ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగానే సమయం ఉంది. అంతేకాదు ప్రస్తుతం అన్ని పార్టీలు టార్గెట్ 2024 గానే వ్యూహాలు రచిస్తున్నారు. విపక్షాలైతే పొత్తులతో ఎలా ముందుకు వెళ్లాలని ఆలోచనలే లెక్కలు వేసుకుంటున్నాయి. ఇక అధికార వైసీపీ (YCP) అయితే ఇప్పటికే ఎన్నికల మూడ్ లోకి వెళ్లింది.. కొత్త జిల్లాల ఏర్పాటుకు వడి వడిగా అడుగులు వేస్తోంది. ఇటు పరిపాలన పరంగా మార్పులు శ్రీకారం చుడుతూ. కీలక అధికారులకు పదవులు పంపకాలపై సీఎం ఫోకస్ చేశారు. త్వరలోనే ఎన్నికల టీం రెడీ చేయడంలో భాగంగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. వీటన్నటింకీ అదనంగా రాజకీయ వ్యూహకర్తల నివేదికలు కూడా సిద్ధం అయ్యాయి. ఇలా వైసీపీ ముందుగానే ఎన్నికల మూడ్ లో ఉంది.. కానీ ముందస్తు ఆలోచన ఉన్నట్టు అయితే వైసీపీ నేతలు ఎవరూ చెప్పండం లేదు.. కానీ విపక్షాలు మాత్రం ముందస్తు పక్కా అంటున్నాయి. తాజాగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchennaidu)హాట్ కామెంట్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఏ క్షణంలో అయినా ఎన్నికల రావొచ్చని ఆయన అన్నారు. ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉందని ఎవరూ నిద్ర పోవద్దన్నారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని చెప్పడమే కాదు.. ఈసారి టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా అచ్చెన్నజోస్యం చెప్పారు.. ఆయన చెప్పిన లెక్క చూస్తే ఎవరైనా షాక్ అవ్వక తప్పదు.. ఎందుకంటే ఇటీవల ఏపీలో జరిగిన ఏ ఎన్నిక చూసినా వార్ వన్ సైడ్ అయ్యింది. ఉప ఎన్నికైనా.. లోకల్ వార్ అయినా వైసీపీ బరిలో ఉంటే.. విపక్షాలు డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా టీడీపీ అధినేత సొంత నియోజకవర్గం.. టీడీపీకి కంచుకోట లాంటి చోటే వైసీపీ జెండా రెప రెపలాడింది అంటే.. అధికార పార్టీ ప్రభంజనం ఎలా ఉందో ఊహించొచ్చు. మరి ఇలాంటి సమయంలో ఎన్నికలు జరిగే టీడీపీకి కచ్చితంగా 160 స్థానాలు వస్తాయని అచ్చెన్నాయుడు జోస్యం చెబుతున్నారు.
అంతేకాదు సీఎం జగన్ తీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఒకవేళ నిద్రలో లేచి రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తున్నట్లు లెటర్ ఇచ్చినా ఎవరైనా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. ఎందుకంటే ఇప్పటికే వరకు సీఎం తీసుకున్న ముఖ్య నిర్ణయాలు అన్నీ.. అర్థరాత్రి తీసుకున్నవే అని గుర్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో తెలుగు రైతు విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో మాట్లాడిన ఆయన
ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైతులను జగన్ ప్రభుత్వం అడుగడుగునా ముంచిందని ఆరోపించారు. ఉద్యోగుల నుంచి పేదల దాకా ప్రతి రంగాన్ని ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని.. రైతులకు ఉరితాళ్లుగా మారిందన్నారు. ఈ ముఖ్యమంత్రి హయాంలో రైతులకు యూరియా కూడా దొరకడం లేదని వాపోయారు.
అలాగే రాష్ట్రంలో సంచలనంగా మారిన మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపైనా అచ్చెన్నా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసును టీడీపీకి అంటగట్టాలని చూశారని మండిపడ్డారు. ఈ హత్య ద్వారా వచ్చిన సింపతీతోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యారని.. కోడి కత్తి డ్రామా సింపతీ పని చేయలేదనే వివేకా హత్యకు తెర తీశారని ఆరోపించారు. వివేకా హత్య కేసులో నిందితులను ఎందుకు శిక్షించడం లేదని ప్రశ్నించారు. ప్రజల్లో ఇప్పుడున్నంత వ్యతిరేకత గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు.
అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికల గురించి, ఎన్నికల్లో గెలుపు గురించి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు చర్చకు తెరలేపాయి. సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్ కూడా నడుస్తున్నారు. 160 సీట్లు ఓడిపోకుండా చూసుకోండి అంటూ వైసీపీ అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.