మండలి రద్దు... సెలెక్ట్ కమిటీ బిల్లులు ఏమవుతాయి? రూల్స్ ఏం చెబుతున్నాయి?

ఏపీ శాసనమండలి రద్దయ్యేందుకు చేపట్టే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్‌లో 99 శాతం పూర్తయ్యేలా కనిపిస్తోంది. ఆల్రెడీ సెలెక్ట్ కమిటీ ప్రక్రియ నడుస్తోంది. నెక్ట్స్ ఏంటి? ఇదంతా ఎలా జరుగుతుంది? తెలుసుకుందాం.

news18-telugu
Updated: January 27, 2020, 12:38 PM IST
మండలి రద్దు... సెలెక్ట్ కమిటీ బిల్లులు ఏమవుతాయి? రూల్స్ ఏం చెబుతున్నాయి?
వైఎస్ జగన్ (ఫైల్)
  • Share this:
కొన్ని రోజులుగా ప్రచారం సాగుతున్నట్లుగానే ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయాన్ని అత్యంత సింపుల్‌గా తీసుకున్నారు. ఏపీలో శాసనమండలి రద్దు సిఫార్సును కేబినెట్ ఈజీగా ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇవాళ అసెంబ్లీలో కూడా ఈ తీర్మాన బిల్లు ఆమోదం పొందేలా కనిపిస్తోంది. మండలిలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లును... ఛైర్మన్... తమ అభ్యంతరాలకు విలువ ఇవ్వకుండా... టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం సెలెక్ట్ కమిటీకి పంపాలన్నారనేది వైసీపీ నేతలు చేస్తున్న ఆగ్రహారోపణ. దీనిపై న్యాయ పరంగా ఏం చెయ్యాలో సీఎం జగన్ నిపుణులతో చర్చించారు. మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో కూడా మాట్లాడారు. మండలి రద్దు అయితే... రాజకీయంగా వైసీపీకే నష్టం కలుగుతుందనే అభిప్రాయం ఓ వైపు వ్యక్తం అవుతోంది. ఎందుకంటే అనేక మందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామనే హామీని జగన్ ఇదివరకు ఇచ్చారు. ఆ హామీల సంగతి తాను చూసుకుంటాననీ... టీడీపీ ఆధిపత్యం ఇప్పటికీ కొనసాగడం, ఆ పార్టీ ఎమ్మెల్సీలు... ప్రభుత్వ బిల్లులకు అడ్డుపడటం ఇకపై ఉండకూడదని జగన్ నిర్ణయించినట్లు తెలిసింది. మండలి రద్దు అయితే... మరి సెలెక్ట్ కమిటీకి పంపే బిల్లుల సంగతేంటి?

మండలి రద్దు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన సీఎం జగన్


ప్రభుత్వం ప్రతిపాదించిన ఆ రెండు బిల్లుల్నీ సెలెక్ట్ కమిటీకి పంపాలన్న మండలి ఛైర్మన్ ప్రకటనకు కౌంటర్‌గా ప్రభుత్వం మండలినే రద్దు చేయాలని నిర్ణయించింది. గతంలోనూ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన ఎస్సీ కమిషన్, ఇంగ్లీషు మీడియం స్కూళ్ల బిల్లుల్ని... మండలి సవరణలు చెయ్యాలంటూ తిప్పి పంపింది. అప్పుడే మండలిని రద్దు చేయాలనే ఆలోచనకి ప్రభుత్వం వచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు రెండు కీలక బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపాలనడంతో... ఇక మండలి వేస్టనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదిస్తే... ఆ తీర్మానం కేంద్రానికి వెళ్తుంది. దాన్ని పార్లమెంట్ రెండు సభలూ ఆమోదిస్తే... రాష్ట్రపతికి చేరుతుంది. ఆయన ఓకే అంటే... చట్టం అవుతుంది. అప్పుడిక మండలి అన్నదే ఉండదు. ఐతే... రాష్ట్రపతి ఆమోదించేవరకూ... మండలి ఉంటుంది. ఎమ్మెల్సీలూ ఉంటారు. సమావేశాలూ ఉంటాయి.

సెలెక్ట్ కమిటీ ఇంకా ఏర్పాటవ్వలేదు. కమిటీలో ఉండే సభ్యుల పేర్లు చెప్పాలని మండలి ఛైర్మన్... రాసిన లేఖలు ఇవాళ పార్టీలకు చేరతాయి. ఆ సభ్యుల పేర్లు చెప్పాక... వాళ్లతో కమిటీ ఏర్పడుతుంది. ఆ కమిటీ మూడు నెలల్లో ఆ బిల్లలపై తమ అభిప్రాయ రిపోర్టును ఇస్తుంది. మండలి రద్దు తీర్మానాన్ని... రాష్ట్రపతి ఆమోదించేందుకు కొంత టైమ్ పట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి... ఆలోగా కమిటీ తమ నివేదికను ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయంటున్నారు. అందువల్ల సెలెక్ట్ కమిటీ ఏ కంగారూ లేకుండా తన పని చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నా్రు రాజకీయ విశ్లేషకులు.

మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రం స్థాయిలో రాష్ట్రపతి ఆమోద ముద్ర పడేనాటికి... ఈ ప్రక్రియ మొత్తం ముగిసేందుకు ఆరు నెలల నుంచీ ఏడాది పట్టొచ్చంటున్నారు. అందువల్ల ఏపీ బడ్జెట్ సమావేశాల్లో రెండు సభలనూ ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారని తెలిసింది. మండలి రద్దు అవ్వక ముందే సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ వస్తే... దానిపై మండలి ఛైర్మన్ పరిశీలనలోకి తీసుకునే అవకాశాలుంటాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

(బాలకృష్ణ - సీనియర్ కరెస్పాండెంట్ - న్యూస్18తెలుగు)

Video: జనాలపై పంజా విసిరిన పులి.. ముగ్గురికి గాయాలు

Published by: Krishna Kumar N
First published: January 27, 2020, 12:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading