మళ్లీ అధికారంలోకి రావాలంటే ఇది చేయండి... బీజేపీకి, వీహెచ్పీ సలహా

.కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై చట్టం తీసుకువస్తే... తప్పకుండా ఎన్నికల్లో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ప్రభుత్వం రామమందిరంపై చట్టం చేస్తే... తప్పనిసరిగా 201 లోక్ సభ ఎన్నికల్లో గెలిచి తీరుతుందన్నారు

Sulthana Begum Shaik | news18-telugu
Updated: January 28, 2019, 12:07 PM IST
మళ్లీ అధికారంలోకి రావాలంటే ఇది చేయండి... బీజేపీకి, వీహెచ్పీ సలహా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బీజేపీ సెంటిమెంట్‌తో ఆడుకుంటుంది విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ). ఇప్పటికే లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో తర్జన భర్జన పడుతున్న కమలనాథులకు వీహెచ్పీ నాయకులు కొత్త కండిషన్లు, సెంటిమెంట్లు పెడుతున్నారు. వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు విష్ణు సదాశివ్ కొక్జే మాట్లాడుతూ ...కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై చట్టం తీసుకువస్తే... తప్పకుండా ఎన్నికల్లో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ప్రభుత్వం రామమందిరంపై చట్టం చేస్తే... తప్పనిసరిగా 2019 లోక్ సభ ఎన్నికల్లో గెలిచి తీరుతుందన్నారు. కానీ ప్రభుత్వం అలా చేయకుండా న్యాయప్రక్రియ తర్వాతే చట్టం చేయాలన్న దానిపై ఆలోచనలు చేస్తుందన్నారు కొక్జే.

మరోవైపు అయోధ్య కేసు విచారణ జనవరి 29న జరగాల్సి ఉండగా దానిని రద్దు చేశారు. ఈ కేసు విచారణ జరపాల్సిన ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనంలో ఒకరు అందుబాటులో లేకపోవడంతో విచారణను రద్దు చేశారు. దీనికి సంబంధించి సుప్రీం కోర్టు అడిషనల్‌ రిజిస్ట్రార్‌ ఆదివారం జారీ చేసిన ఒక సర్క్యులర్‌లో తెలిపింది. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనంలో ఉన్న జస్టిస్‌ ఎస్‌ఎ బాబ్డే అందుబాటులో లేని కారణంగా దీనిపై విచారణ జరపడం లేదని తెలిపింది.

అంతకుముందు ఈ వారారంభంలో ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఇద్దరు కొత్త న్యాయమూర్తులను చేర్చడం ద్వారా ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ పునర్వ్యవస్థీకరించారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణా క్రమాన్ని నిర్ణయిస్తుంది. సీజేఐ రంజన్‌ గొగోయ్‌ ఈ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తుండగా, జస్టిస్‌ బాబ్డేతోపాటు జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌లు సభ్యులుగా ఉన్నారు. ఈ ధర్మాసనాన్ని ఈ నెల 25న ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉండగా...సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూడకుండా రామమందిర నిర్మాణంపై వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆర్ఎస్ఎస్, హిందుత్వవాదులు, కొందరు బీజేపీ నేతలు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు.  ప్రధాని మోదీపై ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. అయితే రామజన్మభూమి వివాదానికి సంబంధించిన న్యాయప్రక్రియ పూర్తయిన తర్వాతే ఆర్డినెన్స్ తీసుకురావాలా వద్ద అనేది నిర్ణయిస్తామని అప్పట్లో ప్రధాని ప్రకటించారు.
First published: January 28, 2019, 12:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading