అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తా.. మాకేదైనా జరిగితే.. : భూమా అఖిలప్రియ

భార్గవరామ్‌పై నమోదైన కేసును అడ్డుగా పెట్టుకుని తమ కుటుంబానికి ఏదైనా హాని చేయాలని చూస్తే.. ఎస్పీ ఫకీరప్పే దానికి బాధ్యత వహించాలని అఖిలప్రియ డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: October 23, 2019, 10:25 AM IST
అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తా.. మాకేదైనా జరిగితే.. : భూమా అఖిలప్రియ
భూమా అఖిలప్రియ (file)
  • Share this:
వ్యాపార లావాదేవీల్లో ఇద్దరు భాగస్వాముల మధ్య తలెత్తిన వివాదాన్ని రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. బెయిల్ వచ్చాక కూడా తన భర్త భార్గవరామ్‌ను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అనుమతి లేకుండా తమ ఇంట్లో తనిఖీల కోసం ముగ్గురు పోలీసులు వచ్చారని..ఆ సమయంలో ముగ్గురిని అరెస్ట్ చేశామని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమను భయభ్రాంతులకు గురిచేసేందుకు కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం కర్నూలు జిల్లా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

భార్గవరామ్‌పై నమోదైన కేసును అడ్డుగా పెట్టుకుని తమ కుటుంబానికి ఏదైనా హాని చేయాలని చూస్తే.. ఎస్పీ ఫకీరప్పే దానికి బాధ్యత వహించాలని అఖిలప్రియ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఎస్పీ తన తీరు మార్చుకోవాలని సూచించారు. లేదంటే గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు.

అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలుస్తానని.. భయపెడితే భయపడే స్థితిలో తాను లేనని స్పష్టం చేశారు.గతంలో తన తండ్రిని కూడా ఇలాగే పోలీసులు వేధించారని.. వేధింపులు తమ కుటుంబానికి కొత్తేమి కాదని తెలిపారు.
Published by: Srinivas Mittapalli
First published: October 23, 2019, 10:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading