కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా డేంజర్... హామీలు అమలు సాధ్యంకాదన్న బీజేపీ

పీకి ప్రత్యేక హోదా అంశంపై కూడా జైట్లీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఏపికి ప్రత్యేక హోదా ఇస్తానని చెబుతుందని , ప్రత్యేక హోదాకు నిధులు ఎక్కనుండి తెస్తుందని ఆయన ప్రశ్నించారు.

news18-telugu
Updated: April 3, 2019, 8:06 AM IST
కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా డేంజర్... హామీలు అమలు సాధ్యంకాదన్న బీజేపీ
అరుణ్ జైట్లీ
  • Share this:
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ముప్పెట దాడి ప్రారంభించింది అధికార పార్టీ బీజేపీ. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన కాసేపటికే.. బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రమాదకరమైన అంశాలు ఉన్నాయన్నారు జైట్లీ, అమలుకు అసాధ్యమన హామీలు పెట్టారని విమర్శించారు. దేశాన్ని ముక్కలు చేసే విధమైన అంశాలు, మావోయిస్టులకు, జిహాదీలకు రక్షణ కల్పించేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందంటూ మండిపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకత్వం మావోయిస్టులు, జిహాదీల చేతుల్లో ఉందన్నారు. ఐపీసీ నుంచి 124-A సెక్సన్ తొలగిస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొందన్నారు. అదే జరిగితే దేశ ద్రోహం అనేది నేరం కిందకు రాదన్నారు. కశ్మీర్ విషయంలో నెహ్రూ-గాంధీ కుటుంబం చారిత్రాత్మక తప్పిదం చేసిందన్నారు.

మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కూడా జైట్లీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఏపికి ప్రత్యేక హోదా ఇస్తానని చెబుతుందని , ప్రత్యేక హోదాకు నిధులు ఎక్కనుండి తెస్తుందని ఆయన ప్రశ్నించారు. తమ రాష్ట్రాలకు సైతం ప్రత్యేక హోదా కావాలని ఒడిశా తో సహ అనేక రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు. ఏపికి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని సీఎం చంద్రబాబు అంగీకరించారని అనంతరం ఆయన కేంద్రానికి లేఖ కూడ రాశారని గుర్తు చేశారు కేంద్రమంత్రి ఆరుణ్ జైట్లీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు యూ టర్న్ తీసుకున్నారని ఆయన విమర్శించారు. ఏపి ఆమోదించిన ప్యాకేజీ ప్రకారం నిధులు అందుతాయని ఆరుణ్ జైట్లీ ప్రకటించారు.
First published: April 3, 2019, 8:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading