సుజనా చౌదరికి షాక్... బ్యాంక్ రుణాలపై నోటీసులు

బ్యాంకులు తమ ఖాతాదారులకు ఇచ్చే రుణాలు వసూలు చేసేందుకు డీఆర్టీ ప్రకారం నోటీసులు అందిస్తుంటాయి.

news18-telugu
Updated: December 4, 2019, 12:15 PM IST
సుజనా చౌదరికి షాక్... బ్యాంక్ రుణాలపై నోటీసులు
సుజనా చౌదరి, బీజేపీ ఎంపీ
  • Share this:
ఏపీ బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి డీఆర్టీ నోటీసులు అందించింది. ఐడీబీఐ రూ. 169కోట్లు ఎగ్గొట్టారంటూ ఐడీబీఐ బ్యాంక్ చెన్నై డీఆర్టీకి ఫిర్యాదు చేసింది. దీంతో సుజనా కంపెనీలకు డీఆర్టీ నోటీసులు అందించింది. నోటీసులు అందించిన వారిలో సుజనా భార్య పద్మజ, ఎస్టీ ప్రసాద్, ధనలక్ష్మీ , సుజనా క్యాపిటల్ సర్వీసెస్, ఎక్స్‌ప్లేయర్ ఎలక్ట్రికల్స్ ఉన్నారు. సుజనా 16వ తేదీన విచారణకు హాజరుకావాలని... లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక డీఆర్టీ అంటే డిబెట్ రికవరీ ట్రిబ్యునల్. బ్యాంకులు తమ ఖాతాదారులకు ఇచ్చే రుణాలు వసూలు చేసేందుకు డీఆర్టీ ప్రకారం నోటీసులు అందిస్తుంటాయి.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>