CM KCR: సీఎం కేసీఆర్‌పై సంచలన సర్వే.. జనం అంత కోపంగా ఉన్నారా? 2023లో ఏం జరగనుంది?

సీఎం కేసీఆర్

IANS-C-Voter Survey: సీఎం కేసీఆర్ పనితీరుకు సంబంధించి సీ-ఓటర్‌ వ్యవస్థాపకుడు యశ్వంత్‌ దేశ్‌ముఖ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై ఎక్కువ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు.

 • Share this:
  ''తెలంగాణ(Telangana)లో కారుకు ఎదురే లేదు. మరో 20 ఏళ్లు మాదే అధికారం.'' టీఆర్ఎస్ నేతలు (TRS leaders) ప్రతిసారీ చెప్పే మాట ఇది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చి సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశంలో మరెక్కడా లేవని చెబుతుంటారు. అందుకే ఆయనకు ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని అభిప్రాయపడుతుంటారు. కానీ ఓ సర్వే మాత్రం టీఆర్ఎస్ వర్గాలకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) మొదటి స్థానంలో నిలిచారు. టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొంది. IANS (ఇండో ఏసియన్ న్యూస్ సర్వీస్), సీ-ఓటర్ సర్వే ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయి. 110 అంశాల ప్రాతిపదికగా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్వే చేసి గవర్నెన్స్ ఇండెక్స్ రూపొందించారు. ఇందులో ప్రజాగ్రహం ఎక్కువగా ఉన్న సీఎంగా కేసీఆర్ నిలిచారు. సర్వేలో పాల్గొన్న వారిలో 30.3శాతం మంది సీఎం కేసీఆర్ పరిపాలన పట్లు గుర్రుగా ఉన్నట్లు తేలింది.

  ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) (28.1%), గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌(27.7%) ఉన్నారు. అత్యల్పంగా ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh సీఎం భూపేశ్‌ సింగ్‌ బఘేల్‌పై 6% మాత్రమే ప్రజాగ్రహం ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో 94శాతం మంది ప్రజలు తమ ముఖ్యమంత్రి పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నట్లు సర్వే ద్వారా తెలిసింది.

  K Chandrashekar Rao: హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ సభ ఉంటుందా? లేదా?

  సీఎం కేసీఆర్ పనితీరుకు సంబంధించి సీ-ఓటర్‌ వ్యవస్థాపకుడు యశ్వంత్‌ దేశ్‌ముఖ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై ఎక్కువ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పనితీరుకు తెలంగాణ ప్రజలు మంచి రేటింగ్ ఇచ్చారని, ఇది బీజేపీకి కలిసి వచ్చే అవకాశముందని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని చేపట్టే అవకాశాలున్నాయని ఆయన జోస్యం చెప్పారు. మంత్రి కేటీఆర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రిని చేయడానికి ఇదే మంచి సమయమని, లేకపోతే పరిస్థితి చేయిదాటి పోతుందని యశ్వంత్ దేశ్‌ముఖ్ అభిప్రాయపడ్డారు.

  Yadadri Temple Reopening: ఆ రోజే యాదాద్రి ఆలయం ప్రారంభం.. సీఎం కేసీఆర్ ప్రకటన

  ఇక దేశంలో అత్యంత ప్రజాగ్రహం ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలుగా ఏపీ ప్రజా ప్రతినిధులు నిలిచారు. 28.5శాతం మంది ప్రజలు ఎమ్మెల్యేల పనితీరుపై కోపంతో ఉన్నట్లు సర్వేలో తేలింది. ఈ జాబితాలో గోవా (24.3శాతం) రెండో స్థానం, తెలంగాణ (23.5శాతం) మూడో స్థానంలో నిలిచింది. ఇక అత్యంత తక్కువ ప్రజాగ్రహం కలిని ప్రజాప్రతినిధులుగా కేరళ ఎమ్మెల్యేలు నిలిచారు. వారిపై కేవలం 6.8శాతం మంది మాత్రమే కోపంతో ఉన్నారు. ఆ తర్వాత గుజరాత్ రెండో స్థానంలో ఉంది. గుజరాత్‌లో 7.4 శాతం మంది మాత్రమే ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

  ఉపరాష్ట్రపతిగా KCR అసలు కథ ఇదే -ఓడిపోతే దుప్పటి కప్పుకోవాలా? -KTR  కీలక వ్యాఖ్యలు

  ఈ సర్వే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అది పెయిడ్ సర్వే అని టీఆర్ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఎన్నో జనాకర్షక పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌పై ప్రజలు ఎందుకు కోపంగా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. ఈ సర్వేను నమ్మాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ శ్రేణులు మాత్రం జోష్‌లో ఉన్నాయి. తెలంగాలో నిజంగానే సీఎం కేసీఆర్ పాలన పట్ల ప్రజలు కోపంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతారని అంటున్నారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: