'ఐయామ్ నాట్ రాహుల్ సావర్కర్.. ఐయామ్ రాహుల్ గాంధీ'

రైతులు అభివృద్ది చెందకుండా,ఉద్యోగులు అభివృద్ది చెందకుండా,నిరుద్యోగాన్ని ప్రారదోలకుండా దేశం ముందుకు వెళ్లలేదని రాహుల్ అన్నారు. భారత్‌ను ఎవరో శత్రువులు నాశనం చేయలేదని..స్వయంగా మోదీనే దేశాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు.

news18-telugu
Updated: December 14, 2019, 3:17 PM IST
'ఐయామ్ నాట్ రాహుల్ సావర్కర్.. ఐయామ్ రాహుల్ గాంధీ'
రాహుల్ గాంధీ (ఫైల్)
  • Share this:
'అత్యాచారాల భారతం' అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు క్షమాపణ అడుగుతున్నారని.. కానీ చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. నిజం మాట్లాడేందుకు క్షమాపణ చెప్పడానికి తాను రాహుల్ సావర్కర్‌ను కాదని.. రాహుల్ గాంధీని అని స్పష్టం చేశారు. నిజాలు నిర్భయంగా మాట్లాడేందుకు తానెవరికీ భయపడనని అన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ అత్యంత పతనావస్థలో ఉందని.. ప్రపంచమంతా భారత్‌లో ఏం జరుగుతోందని ఆరా తీస్తోందంటూ వ్యాఖ్యానించారు. భిన్న సంస్కృతులకు,భిన్న ధర్మాలకు నెలవైన దేశంలో విభజన రాజకీయాలతో చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ విధానాలతో అసోం నుంచి కశ్మీర్ వరకు అంతా తగలబడిపోతోందన్నారు. బీజేపీ ఆర్థిక విధానాలు,ఎన్‌ఆర్‌సీ,రైతు సమస్యలు,నిరుద్యోగం వంటి వాటిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసిన 'భారత్ బచావో' సభలో రాహుల్ ఒకింత ఆవేశంగా మాట్లాడారు.

ఒకానొక రాత్రి 8గంటలకు ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించారని రాహుల్ గుర్తుచేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడలేదన్నారు.సామాన్యుల జేబుల్లో నుంచి ప్రభుత్వం డబ్బులు లాగేసుకుందన్నారు. లక్షల కోట్ల రూపాయలు ఆదానీ సహా ఇతర పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆరోపించారు.గడిచిన ఐదేళ్లలో ఒక్క ఆదానీకే కేంద్రం లక్షల కోట్ల విలువ చేసే 50 కాంట్రాక్టులు అప్పగించిందన్నారు. దాదాపు 20మంది పారిశ్రామికవేత్తలకు రూ.1.40లక్షల కోట్ల రుణమాఫీ చేసిన మోదీ.. రైతులకు మాత్రం ఎందుకు రుణమాఫీ చేయలేదన్నారు.పెద్ద నోట్ల రద్దు సమయంలో ముందు పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్,మాజీ కేంద్రమంత్రి చిదంబరం సూచించినా మోదీ పట్టించుకోలేదన్నారు. ఫలితంగా ఇప్పటికీ సామాన్యల జేబుల్లో డబ్బులు లేకుండా పోయాయని అన్నారు.

రైతులు అభివృద్ది చెందకుండా,ఉద్యోగులు అభివృద్ది చెందకుండా,నిరుద్యోగాన్ని ప్రారదోలకుండా దేశం ముందుకు వెళ్లలేదని రాహుల్ అన్నారు. భారత్‌ను ఎవరో శత్రువులు నాశనం చేయలేదని..స్వయంగా మోదీనే దేశాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. ఎవరీ వద్ద డబ్బు లేకుండా చేసి.. వారి కొనుగోలు శక్తిని దెబ్బతీసి ఆర్థిక మందగమనానికి కారణమయ్యాడని ఆరోపించారు.దేశంలో ఉన్న మీడియాను కూడా కొనేసి తనకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. మోదీ మీడియాను కొనగలరేమో గానీ దేశంలోని పౌరులను కొనలేరని అన్నారు. దేశంలోని ప్రతీ వ్యవస్థలో పనిచేసే పౌరులందరికీ దేశంపై బాధ్యత ఉందని గుర్తుచేశారు.First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>