I WOULD DIE THAN BENEFIT BJP IN THIS ELECTION PRIYANKA SAYS AFTER MAYAWATIS ATTACK MS
అలా చేయడం కంటే.. నేను చచ్చిపోతాను : ప్రియాంక గాంధీ
ప్రియాంక గాంధీ(ఫైల్ ఫోెటో)
బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్‌ను ఉద్దేశించి పలు విమర్శలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వ్యతిరేక ఓటు చీల్చేందుకే కాంగ్రెస్ సొంతంగా పోటీ చేస్తోందని మాయావతి ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఈసారి ప్రధాన పోటీ ఎస్పీ-బీఎస్పీ కూటమి వర్సెస్ బీజేపీగా ఉంటుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా సత్తా చాటుతామన్న ధీమాతో ఉంది.నిజానికి కూటమిలో కాంగ్రెస్‌ను కూడా కలుపుకుపోతారా? అన్న చర్చ జరిగినప్పటికీ.. మాయావతి, అఖిలేశ్ ఆ ప్రతిపాదనను దూరం పెట్టేశారు. కాంగ్రెస్ వల్ల తమకు పెద్దగా ఒరిగేదేమి ఉండదని కూటమిలో చేర్చుకోలేదు. దీంతో కాంగ్రెస్ సొంతంగా బరిలో దిగింది. అక్కడ పార్టీ గెలుపు బాధ్యతలను ప్రియాంక తన భుజాలపై మోస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించగా.. ప్రియాంక నుంచి గట్టి బదులే వచ్చింది.
బీజేపీకి ప్రయోజనం చేకూర్చడం కంటే నేను చచ్చిపోవడానికే మొగ్గుచూపుతా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేస్తోంది. ఈ యుద్దం దేశం కోసం..
— ప్రియాంక గాంధీ, తూర్పు యూపీ కాంగ్రెస్ ఇన్చార్జి
అంతకుముందు మాయావతి కాంగ్రెస్‌ను ఉద్దేశించి పలు విమర్శలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ వ్యతిరేక ఓటు చీల్చేందుకే కాంగ్రెస్ సొంతంగా పోటీ చేస్తోందని మాయావతి ఆరోపించారు. కాంగ్రెస్-బీజేపీ మధ్య అంతర్గత ఒప్పందం ఉందని.. రెండూ కలిసే ఉన్నాయని ఆరోపించారు. కాబట్టి ఓటర్లంతా కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.