• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • I WONT CONTEST IN ELECTIONS IN FUTURE CONGRESS LEADER CHINNAREDDY AFTER HE LOST MLC ELECTIONS SK

Telangana: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి.. కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి సంచలన నిర్ణయం

Telangana: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి.. కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి సంచలన నిర్ణయం

చిన్నారెడ్డి (ఫైల్ ఫొటో)

Telangana: నాగార్జునసాగర్‌లో జానారెడ్డి మాత్రమే టీఆర్ఎస్‌ను తట్టుకోగలరని చిన్నారెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆయన ధీమావ్యక్తం చేశారు.

  • Share this:
    పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారి టీఆర్ఎస్ సత్తా చాటింది. రెండు చోట్లా విజయం సాధించి మళ్లీ పూర్వ వైభవం సాధించింది. దుబ్బాకలో ఓటమి, జీహెచ్ఎంసీలో అనుకున్నన్ని సీట్లు రాకపోవడంతో కాస్త నిరుత్సాహానికి గురయ్యారు ఆ పార్టీ కార్యకర్తలు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో గులాబీ దళంలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పూర్తిగా అట్టర్ ఫ్లాపయింది. హైదరాబాద్ సెగ్మెంట్‌లో నాలుగో స్థానంలో ఉంటే.. నల్గొండలో ఐదో స్థానానికి పడిపోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయబోనని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని.. కోట్ల రూపాయల డబ్బు ఖర్చు చేసిందని విమర్శించారు. డబ్బు లేకపోతే ఎవరూ ఎన్నికల్లో పోటీచేయవద్దని ఆయన సూచించారు.


    ''పట్టభద్రులు సైతం టీఆర్ఎస్‌కు ఓట్లు అమ్ముకోవటం బాధ కలిగిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు డబ్బులు అడ్డగోలుగా పంచాయి. కేవలం డబ్బులు పంచలేకపోవటం వల్లే మాకు ఓట్లు పడలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో డబ్బు లేనిదే ఎన్నికలను ఎదుర్కొనే పరిస్థితి లేదు. డబ్బు లేని వారు ఎన్నికట్లో పోటీచేయకపోవడమే మంచిది. డిగ్రీ చదవని వాళ్లకు కూడా ఓటు హక్కు కల్పించారు. తప్పుడు సర్టిఫికెట్లతో ఓట్లు నమోదు చేశారు. ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను.''అని చిన్నారెడ్డి పేర్కొన్నారు.

    తమ పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డి శక్తికి మించి తనకు సహకరించారని తెలిపారు చిన్నారెడ్డి. తెలంగాణను తాగుబోతులు, లంచగొండి రాష్ట్రంగా మార్చారని.. కేసీఆర్ నుంచి తెలంగాణను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డబ్బు ఖర్చు చేయటంలో భవిష్యత్‌లో సీఎం కేసీఆర్‌ను ఎవరూ తట్టుకోలేరని ఆయన వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్‌లో జానారెడ్డి మాత్రమే టీఆర్ఎస్‌ను తట్టుకోగలరని చిన్నారెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆయన ధీమావ్యక్తం చేశారు.

    కాగా, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి విజయం సాధించారు. మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపి వాణిదేవికికి 1,49, 269 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రామచంద్రారావుకు 1,37,566కి ఓట్లు పడ్డాయి. రామచంద్రరావుపై 11,703 ఓట్ల ఆధిక్యంతో వాణిదేవి విజయం సాధించారు. ఇక మొత్తం ఏడు రౌండ్లలోని మొదటి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి 1,12,689 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు రెండో స్థానంలో నిలిచారు. ఆయనకు 1,04,668 పోలయ్యాయి. ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 53,610, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,554, టీడీపీ అభ్యర్థి ఎల్‌.రమణకు 5,973 ఓట్లు వచ్చాయి. ఏడు రౌండ్లలో మొత్తం 21,309 చెల్లని ఓట్లను గుర్తించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు