హోమ్ /వార్తలు /National రాజకీయం /

చేవెళ్ల నాదే.. టీఆర్ఎస్ తరఫున ఆ ముగ్గురిలో ఒకరు బరిలో దిగొచ్చు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల నాదే.. టీఆర్ఎస్ తరఫున ఆ ముగ్గురిలో ఒకరు బరిలో దిగొచ్చు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

కొండా విశ్వేశ్వర్ రెడ్డి

కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్లలో టీఆర్ఎస్ తరఫున ఎవరిని బరిలో దింపినా తానే గెలుస్తానని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.

చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో తానే గెలుస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ తరఫున నిర్వహించిన సర్వేల్లో కూడా తానే గెలుస్తానని రిపోర్ట్ వచ్చిందని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. అభ్యర్థుల పేర్లను మార్చి మార్చి సర్వేలు నిర్వహిస్తున్నారన్న చేవెళ్ల ఎంపీ.. టీఆర్ఎస్ బరిలో ఎవరిని దింపినా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్లలో తనపై పోటీకి దించడానికి ముగ్గురి పేర్లను టీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తోందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి, ఓ పౌల్ట్రీ ఫామ్ నిర్వహించే పారిశ్రామికవేత్త పేరును టీఆర్ఎస్ పరిశీలిస్తోందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. మహేందర్ రెడ్డి ఓడిపోతారన్న ఉద్దేశంతోనే ఆయనను పక్కన పెట్టారని చెప్పారు. మహేందర్ రెడ్డి పోటీ చేయడానికి సిద్ధపడి ప్రచారం చేశారని.. అయితే, ఆయన 22 శాతం ఓట్లు వెనుకబడి ఉండడంతో ఆయన్ను టీఆర్ఎస్ తప్పించిందని చెప్పారు.

పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని ఆ పార్టీ నేతలు చెప్పకనే చెప్పారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రభావం అసెంబ్లీ మీద కూడా ఉంటుంది కాబట్టి.. ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారని విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 16 ఎంపీ సీట్లు గెలుస్తామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్న మాటల్లో విశ్వాసం లేదని.. కేవలం ప్రచారం మాత్రమే ఉందన్నారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని తప్పులు చేసిందని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తాను మద్యం, డబ్బులు పంచడానికి రాజకీయాల్లోకి రాలేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తాను సక్సెస్‌ఫుల్ బిజినెస్‌ను పక్కనపెట్టి తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.

First published:

Tags: Chevella, CM KCR, Konda Vishweshwar reddy, Lok Sabha Election 2019, Tpcc, Trs

ఉత్తమ కథలు