ఆ సంగతి కేసీఆర్‌తో నేను మాట్లాడుతా..: బీసీ గర్జనలో జగన్

ప్రతీ బీసీ కులానికి ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని, నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని బీసీ గర్జన సభలో జగన్ హామీలిచ్చారు.

news18-telugu
Updated: February 17, 2019, 10:29 PM IST
ఆ సంగతి కేసీఆర్‌తో నేను మాట్లాడుతా..: బీసీ గర్జనలో జగన్
కేసీఆర్, వైసీపీ బీసీ గర్జన సభలో జగన్..
  • Share this:
వైసీపీ బీసీ గర్జన సభలో బీసీలపై హామిల జల్లు కురిపించిన జగన్.. తెలంగాణ బీసీ సమస్యలపై కూడా స్పందించారు. రాష్ట్రం విడిపోయాక తెలంగాణలో 32 బీసీ కులాలను ఆ జాబితా నుంచి తొలగించారని అన్నారు. తన పాదయాత్ర సందర్భంగా చాలామంది ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. అమరావతి శంకుస్థాపన సందర్భంగా కేసీఆర్ ఏపీకి వస్తే.. చంద్రబాబుకు ఆ విషయం గురించి మాట్లాడాలన్న ఆలోచనే రాలేదని విమర్శించారు.

నందమూరి హరికృష్ణ చనిపోయినప్పుడు.. ఆయన శవాన్ని పక్కనే పెట్టుకుని పొత్తుల గురించి కేటీఆర్‌తో మాట్లాడిన చంద్రబాబు.. కేసీఆర్ అమరావతికి వచ్చినప్పుడు మాత్రం తెలంగాణలో బీసీల సమస్య గురించి ఆయనతో మాట్లాడలేదన్నారు. బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ది అలాంటిదని విమర్శించారు. భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే ఈ సమస్యపై తాను కేసీఆర్‌తో మాట్లాడుతానని చెప్పారు. జాబితా నుంచి తొలగించిన 32 బీసీ కులాలను తిరిగి అందులో చేర్చేలా ప్రయత్నం చేస్తానని అన్నారు.


వైసీపీ అధికారంలోకి వస్తే బడ్జెట్‌లో మూడో వంతు నిధులను బీసీలకు కేటాయిస్తామని జగన్ హామి ఇచ్చారు. ప్రతీ బీసీ కులానికి ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని, నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ఇక చేనేత మహిళకు పెట్టుబడి రాయితీ కింద ప్రతీ నెలా రూ.2వేలు, మేకలు, గొర్రెలు చనిపోతే యాదవులకు రూ.6 వేలు పరిహారం, మత్స్యకారుల బోట్లకు సబ్సిడీపై డీజిల్‌ వంటి హామిలు ఇచ్చారు.(బీసీ గర్జన సభ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి భాయ్ పూలే విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న జగన్..)

ఇది కూడా చదవండి : YSRCP BC Garjana వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్.. రూ.75,000 కోట్లు, 139 కార్పొరేషన్లు, ఇంకా...
First published: February 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading