పవన్ కళ్యాణ్ శపథం... వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు...

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకు తాను నిద్రపోనని పవన్ కళ్యాన్ శపథం చేశారు. మూడురాజధానుల ఏర్పాటుకు ముందడుగు వేయడంతో వైసీపీ వినాశనానికి పునాది పడిందన్నారు.

news18-telugu
Updated: January 21, 2020, 2:21 PM IST
పవన్ కళ్యాణ్ శపథం... వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు...
Video : సీఏఏకు పవన్ కళ్యాణ్ మద్దతు.. వారికి నష్టంలేదని వివరణ
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకు తాను నిద్రపోనని పవన్ కళ్యాన్ శపథం చేశారు. మూడురాజధానుల ఏర్పాటుకు ముందడుగు వేయడంతో వైసీపీ వినాశనానికి పునాది పడిందన్నారు. అమరావతిలో రైతులు జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కలసి తమ గోడు చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘మీకు నేను మాటిస్తున్నా. మీ ఒంటి మీద పడిన దెబ్బ వైసీపీ సర్వనాశనానికి దారి తీస్తుంది. కనీసం పోలీసులు కొడితే అమ్మా అని కూడా అరవలేని రైతు కిరణ్ నాయక్‌ను కూడా పోలీసులు కొట్టారు. అలాంటి వాడిని కూడా కొట్టారు. ఆ బాధ వైసీపీని సర్వనాశనం చేస్తుంది. మీకు ద్రోహం చేసిన వాడు సర్వనాశనం అయ్యే వరకు భగవంతుడు ఉపేక్షించడు. కూల్చివేతలతో పాలన ప్రారంభించిన వైసీపీ చివరకు కూల్చివేతలతోనే ముగుస్తుంది. ప్రజల కన్నీళ్లు ఆనంద భాష్పాలు అయ్యే వరకు జనసేన అండగా ఉంటుంది’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

ఢిల్లీ నుంచి తనకు ఫోన్ వచ్చిందని రేపు హస్తిన వెళ్తున్నట్టు పవన్ కళ్యాన్ చెప్పారు. అయితే, ఈ భేటీలో అద్భుతాలు జరుగుతాయని తాను భావించడం లేదన్నారు. కానీ, అమరావతి మాత్రం ఇక్కడి నుంచి కదలదని మాట ఇస్తున్నానన్నారు. ఈ రోజు అమరావతిని మోసం చేసిన వారు రేపు కడప, విశాఖ ప్రజలను కూడా మోసం చేస్తారని ఆరోపించారు. సెక్రటేరియట్ ఉద్యోగులు కూడా ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయ నేతలను నమ్మకుండా ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. భవిష్యత్తులో ఉద్యోగులకు సమస్యలు వస్తే ప్రజలు అండగా ఉంటారన్నారు.

First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు