Home /News /politics /

I WILL NOT LEAVE COUNTRY OR BE IN ACTIVE POLITICS TILL I CLEAR MY NAME SAYS ROBERT VADRA BA

ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా శపథం...

రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ(File)

రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ(File)

‘నా మీద కేసు క్లియర్ అయ్యే వరకు నేను దేశం విడిచి వెళ్లను. అలాగే, క్రియాశీలక రాజకీయాల్లోకి కూడా రాను. ఆ మేరకు నేను హామీ ఇస్తున్నా.’ అని రాబర్ట్ వాద్రా స్పష్టం చేశారు.

    ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా శపథం చేశారు. తన మీద ఉన్న ఆరోపణలను తప్పని రుజువు చేసేంత వరకు తాను దేశం విడిచి వెళ్లబోనని ప్రతిజ్ఞ చేశారు. అలాగే, నిజం నిరూపితం అయిన తర్వాతే తాను క్రియాశీలక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని స్పష్టం చేశారు. ‘నేను ఈ దేశంలో ఉన్నా. చాలా మంది ఈ దేశాన్ని దోచుకుని విదేశాలకు పారిపోయారు. వారి సంగతి ఏంటి? నేను ఎప్పటికీ ఈ దేశంలోనే ఉంటా. నా మీద కేసు క్లియర్ అయ్యే వరకు నేను దేశం విడిచి వెళ్లను. అలాగే, క్రియాశీలక రాజకీయాల్లోకి కూడా రాను. ఆ మేరకు నేను హామీ ఇస్తున్నా.’ అని స్పష్టం చేశారు.



    రాబర్ట్ వాద్రా మీద మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. లండన్‌లో పలు విలాసవంతమైన భవనాలు ఆయన పేరు మీద ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆయన్ను ఈడీ పిలిచి విచారణ జరిపింది. ఆయన తల్లిని కూడా విచారించారు. ఈ క్రమంలో ఆయన తాజాగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాననే విధంగా ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. తాను యూపీలో పుట్టానని, ఇక్కడి వారితో అనుబంధం ఉందని చెప్పారు. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని ప్రచారం జరిగింది.
    First published:

    Tags: Congress, Priyanka Gandhi, Robert Vadra

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు