లోక్‌సభ ఎన్నికల్లో పోటీ లేదు... కేవలం ప్రచారం మాత్రమే: మాయావతి

24 ఏళ్ల తరవాత ములాయం, మమత ఇద్దరు నేతలు కలిసి పనిచేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అప్పట్లో యూపీలో రెండు పార్టీలదే హవా నడిచిన నేపథ్యంలో ఈ ఇరువురు నేతల మధ్య సత్సంబంధాలు లేవు.

news18-telugu
Updated: March 29, 2019, 8:52 PM IST
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ లేదు... కేవలం ప్రచారం మాత్రమే: మాయావతి
బీఎస్పీ అధినేత్రి మాయావతి
  • Share this:
బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ఈ సారి జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు దూరమయ్యారు. ఈసారి ఎన్నికల బరిలోకి దిగడం లేదని ఆమె ప్రకటించారు. కావాలంటే మళ్లీ ఎక్కడనుంచైనా పోటీచేసి గెలుస్తానన్నారు. ఏ స్థానం నుంచైనా అభ్యర్థిని తప్పించి అయినా పోటీ చేసి గెలుస్తానన్నారు మాయావతి.ఎన్నికల ప్రచారంపై పూర్తిస్థాయిగా దృష్టి పెట్టేందుకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు మాయావతి. గత కొన్ని రోజులుగా జరిగిన పార్టీ సమావేశాల్లో కూడా ఆమె ఈ మేరకు సంకేతాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాలు ఆమెను పోటీ చేయాలని కోరుతున్నప్పటికీ ఆమె అందుకు విముఖుత వ్యక్తం చేశారు. దీంతో స్టార్ క్యాంపెయినర్‌గా మారి విస్త్రుత ప్రచారం చేయాలని ఆమె భావిస్తున్నారు. కేవలం పార్టీ తరపున.... ఎస్పీ-బీఎస్పీ పొత్తు నేపథ్యంలో ఎస్పీ తరపున కూడా ఆమె ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 2న ఒడిశాలోని భువనేశ్వర్‌ నుంచి ఆమె ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్పీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌ తరపున మాయావతి ప్రచారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి.

24 ఏళ్ల తరవాత ములాయం, మమత  ఇద్దరు నేతలు కలిసి పనిచేయడం ఇదే మొదటి సారి కావడం విశేషం. అప్పట్లో యూపీలో రెండు పార్టీలదే హవా నడిచిన నేపథ్యంలో ఈ ఇరువురు నేతల మధ్య సత్సంబంధాలు లేవు. అయితే ఎలాగైనా అధికార పార్టీ బీజేపీను గద్దెదించాలన్న ఏకైక లక్ష్యంతో గోరఖ్‌పూర్‌ ఉప ఎన్నికల సందర్భంగా ఎస్పీ, బీఎస్పీలు జతకట్టాయి. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ములాయం సింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మెయిన్‌పురి నియోజకవర్గంలో ఆయన తరపున మాయావతి ప్రచారం నిర్వహించబోతున్నారు. ఏప్రిల్‌ 19వ తేదీన ఎస్పీ మెయిన్‌పురిలో నిర్వహించనున్న సభకు హాజరుకావాలని మాయావతి నిర్ణయించారు.

దాదాపు, రెండున్నర దశాబ్దాల తర్వాత ములాయం సింగ్ యాదవ్ పార్టీతో వేదిక పంచుకోబోతున్న మాయావతి.. తాను పోటీ చేసేందుకు అంబేడ్కర్‌ నగర్‌, నగీనా పార్లమెంటు స్థానాలను ముందుగా పరిశీలించారు. అయితే, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ తాను పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. అయితే మాయావతి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు బీఎస్పీతో పాటు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధాని రేసులో మాయావతి కూడా ఉండటంతో ఆమె పోటీ చేయకపోవడం వెనుక అనేక రాజకీయ కారణాలు ఉండవచ్చిన విశ్లుషిస్తున్నారు.


First published: March 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు