కేసీఆర్‌కు నేనిచ్చే రిటర్న్ గిఫ్ట్ అదే.. చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్

జగన్ మోహన్ రెడ్డికి డబ్బు అంటే ప్రేమ కాదని, పిచ్చి అని చంద్రబాబు కామెంట్స్ చేశారు. గౌరు వెంకటరెడ్డి లాంటి నిజాయితీపరులకు కూడా టికెట్ ఇవ్వలేదంటే, అది డబ్బుల కోసం కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు.

news18-telugu
Updated: March 9, 2019, 7:45 PM IST
కేసీఆర్‌కు నేనిచ్చే రిటర్న్ గిఫ్ట్ అదే.. చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. తన దగ్గర రాజకీయంగా ఎదిగి, ఇప్పుడు తన ముందే కుప్పిగంతులు వేస్తే చెల్లవని హెచ్చరించారు. కేసీఆర్ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే.. తిరుగు టపాలో ఓటమిని పంపిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టిన కేసీఆర్‌ పంచన జగన్ చేరారు. కేసీఆర్ నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు. జగన్‌కు వెయ్యి కోట్లు పంపించారు. తిరుగుటపాలో ఓటమిని పంపిస్తా. మీకు ఒక్క ఓటు కూడా రాదు. ఒక్క సీటు కూడా రాదు.’ అని చంద్రబాబునాయుడు అన్నారు. కర్నూలు జిల్లా పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మరికొందరు వైసీపీ నాయకులు అమరావతిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

జగన్ మోహన్ రెడ్డికి డబ్బు అంటే ప్రేమ కాదని, పిచ్చి అని చంద్రబాబు కామెంట్స్ చేశారు. కేసీఆర్‌తో పెట్టుకుంటే లోటస్ పాండ్ పోతుందని జగన్ భయపడుతున్నారని చంద్రబాబు అన్నారు. గౌరు వెంకటరెడ్డి లాంటి నిజాయితీపరులకు కూడా టికెట్ ఇవ్వలేదంటే, అది డబ్బుల కోసం కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డిని చూస్తే జాలేస్తోందన్న చంద్రబాబునాయుడు.. వైసీపీ మళ్లీ ఓడిపోవడం ఖాయమన్నారు. అయితే, ఈసారి నమ్ముకున్న కార్యకర్తలను కూడా జైలుకు తీసుకెళ్తున్నారని పరోక్షంగా ఫామ్ 7 దరఖాస్తులు చేసిన వారిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

First published: March 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>