బ్రాండ్ మీరు చెబితే.. బ్రాండింగ్ నేను చేస్తా... పవన్ కళ్యాణ్

దేవాలయాల్లో స్వామి, అమ్మవార్లకు సమర్పించడానికి పట్టువస్త్రాలు కూడా చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

news18-telugu
Updated: December 5, 2019, 5:31 PM IST
బ్రాండ్ మీరు చెబితే.. బ్రాండింగ్ నేను చేస్తా... పవన్ కళ్యాణ్
మదనపల్లెలో చేనేత కళాకారులతతో పవన్ కళ్యాణ్
  • Share this:
చేనేత కార్మికుల శ్రమకు తగిన ఫలితం రావట్లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అరుదైన కళను కాపాడుకుంటున్న చేనేత కళాకారులకు పది రూపాయలు ఎక్కువే ఇవ్వాలని తాను కోరుకుంటానని చెప్పారు. రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ మదనపల్లిలో చేనేత కార్మికులతో సమావేశం అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ‘దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ లేదు. రాష్ట్రంలో ఉన్న చేనేత సంఘాలు అన్నీ కలసి బ్రాండ్ నేమ్ తయారు చేస్తే దానికి నేను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండి ప్రమోట్ చేస్తా. పది మందికి తెలిసిన వ్యక్తి ప్రచారం చేస్తే శ్రమకు తగ్గ ఫలితం, గుర్తింపు వస్తుంది. ఎప్పుడో కోలా కంపెనీకి బ్రాండింగ్ చేశా. కానీ, నేను వాడని ఉత్పత్తికి బ్రాండింగ్ చేయడం సరికాదని తప్పుకొన్నా. చేనేత ఉత్పత్తులు వాడతాను కాబట్టి బ్రాండింగ్ చేస్తా.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

చేనేత మగ్గం తొక్కే ఆడపడుచులకు గర్భసంచి సమస్యలు వస్తాయని, ఈ సమస్యలను కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. దేవాలయాల్లో స్వామి, అమ్మవార్లకు సమర్పించడానికి పట్టువస్త్రాలు కూడా చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని చేనేత సంఘాలతో కలసి విజయవాడలో ఓ సమావేశం ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు.

First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>