జగన్‌కు నా మద్దతు.. త్వరలోనే వైసీపీలో చేరతా: వల్లభనేని వంశీ

జగన్మోహన్ రెడ్డికి బేషరతుగా మద్దతు ఇస్తున్నానన్న వల్లభనేని వంశీ.. ఆయనతో కలిసి నడవాలని నిర్ణయిచుకున్నట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరలోనే వైసీపీలో చేరతానని ప్రకటించారు.

news18-telugu
Updated: November 14, 2019, 5:56 PM IST
జగన్‌కు నా మద్దతు.. త్వరలోనే వైసీపీలో చేరతా: వల్లభనేని వంశీ
వల్లభనేని వంశీ
  • Share this:
టీడీపీతో పాటు మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని.. ఎన్టీఆర్ తర్వాత ఆ పార్టీ ఎప్పుడూ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయలేదని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో హుజూర్ నగర్ ఎన్నికల్లో 2వేల ఓట్లు కూడా పడలేదని ఎద్దేవా చేశారు. తనను బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో కొనసాగించాలని చూస్తున్నారని.. ఏ పదవిపైనా తనకు ఆశ లేదని స్పష్టం చేశారు వంశీ. జగన్మోహన్ రెడ్డికి బేషరతుగా మద్దతు ఇస్తున్నానన్న వల్లభనేని వంశీ.. ఆయనతో కలిసి నడవాలని నిర్ణయిచుకున్నట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరలోనే వైసీపీలో చేరతానని ప్రకటించారు. కేసులకు భయపడి ఆ పార్టీకి మద్దతివ్వడం లేదని.. జగన్ పథకాలు నచ్చే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు వంశీ.

కాగా, అక్టోబరు 27న టీడీపీకి గుడ్‌బై చెప్పారు వల్లభవనేని వంశీ. ఎమ్మెల్యే పదవి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వైసీపీ నేతలు, కొందరు అధికారుల తీరు వల్ల కేడర్‌ ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఐతే ఆయన ఉన్నట్టుడండి గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు వల్లభనేని వంశీ. చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తూనే.. సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ఏపీ ప్రభుత్వ పథకాలు చాలా బాగున్నాయని.. గన్నవరం నియోజక అభివృద్ధి కోసం జగన్‌తో కలిసి నడుస్తానని చెప్పారు. జగన్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిందన్న ఆయన.. అప్పుడే నిరసనలు చేయడం సమంజసం కాదని టీడీపీని విమర్శించారు వంశీ.First published: November 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com