Nusrat Jahan: తనకు ఫత్వా జారీ చేయడంపై గట్టిగానే కౌంటర్ ఇచ్చిన నుస్రత్ జహాన్..

ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయక ముందే  నుస్రత్ జహాన్ తన బాయ్ ఫ్రెండ్ నిఖిల్ జైన్‌ను హిందూ సంప్రదాయ పద్దతిలో టర్కీలో పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచింది.  పెళ్లి తర్వాత  ఈ నెల 25న  లోక్‌సభలో ఎంపీగా సాంప్రదాయ బద్దంగా..నుదుటిన కుంకుమ తిలకం, కాలికి మెట్టలతో హిందూ సంప్రదాయంలో దర్శనిమిచ్చింది. తాజాగా ఈమె వస్త్రధారణ పై మండిపడుతూ ముస్లిమ్ మత పెద్దలు ఫత్వా జారీ చేయడంపై సంచలనంగా మారింది. తనకు ఫత్వా జారీ చేయడంపై నుస్రత్ గట్టిగానే సమాధానమిచ్చింది.

news18-telugu
Updated: June 30, 2019, 1:41 PM IST
Nusrat Jahan: తనకు ఫత్వా జారీ చేయడంపై గట్టిగానే కౌంటర్ ఇచ్చిన నుస్రత్ జహాన్..
పెళ్లి తర్వాత ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన నుస్రత్ జహాన్
news18-telugu
Updated: June 30, 2019, 1:41 PM IST
2019 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ రెండోసారి అధికారంలో వచ్చింది. అదే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని ‘బసీర్‌హాట్’ నుంచి లోక్‌సభకు  తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైంది నుస్రత్ జహాన్. పార్లమెంట్‌కు ఎన్నికైన తర్వాత ఈ భామతో తన తోటి నటి కమ్ పార్లమెంటెరీయన్ మిమి చక్రబర్తితో కలిసి పార్లమెంట్ సెంట్రల్ హాల్ ముందు హాట్ హాట్ గా దర్శనమిచ్చి ప్రేక్షకులతో పాటు రాజకీయ నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయక ముందే  ఈ భామ తన బాయ్ ఫ్రెండ్ నిఖిల్ జైన్‌ను హిందూ సంప్రదాయ పద్దతిలో టర్కీలో పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచింది.  పెళ్లి తర్వాత  ఈ నెల 25న  లోక్‌సభలో ఎంపీగా సాంప్రదాయ బద్దంగా..నుదుటిన కుంకుమ తిలకం, కాలికి మెట్టలతో హిందూ సంప్రదాయంలో దర్శనిమిచ్చింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా... లోక్‌సభలో ఆమె హిందూ పద్థతిలో రావడంపై ముఫ్తీ అపద్ వాస్మీ అనే మత పెద్ద తీవ్రంగా తప్పుబట్టారు. నుదటన కుంకుమ తిలకం, మెడలో మంగళ సూత్రం, కాలికి మెట్టలతో సభకు హాజరు కావడంపై ముఫ్తీ మండిపడ్డారు. అంతేకాదు నుస్రత్.. ఇస్లాంలో ఉన్న షరియత్‌ను ఉల్లంఘించారంటూ ఆమెపై ఫత్వా జారీ చేశారు. నుస్రత్ కు ముస్లిమ్ మత పెద్దలు  ఫత్వా జారీ చేయడం సంచలనంగా మారింది. తనపై వచ్చిన విమర్శలకు నుస్రత్.. ఘాటుగానే సమాధానమిచ్చింది.



 ట్విట్టర్ వేదికగా స్పందించిన నుస్రత్ జహాన్.. కుల, మత, ప్రాంతాలకు అతీతమైన భారతావనికి ప్రతీకను నేను అంటూ సమాధానమిచ్చింది. నేను జన్మత: ముస్లిమ్ అయినా.. నేను అన్ని మతాలను గౌరవిస్తానని సమాధానమిచ్చి.. తనకు ఫత్వా జారీ చేసిన వాళ్లకు గట్టి సమాధానమిచ్చింది. నేను హిందూ మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఇప్పటికీ నేను ముస్లిమ్ నే. నేనే ఏం ధరించాలో ఎవరు చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు విశ్వాసమనేది మన ఆహార్యానికి సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చింది. మత చాందసవాధులు చేసే విమర్శలకు స్పందించడం అంటే జాతి విద్వేశాలను రెచ్చగొట్టడం వంటిదే అంటూ వ్యాఖ్యానించింది. చరిత్రే దానికీ సాక్ష్యమన్నారు. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరుపున లోక్‌సభకు మూడున్నర లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించింది.


First published: June 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...