‘జూన్ 8 వరకు నేనే సీఎం’.. దిగడానికి చంద్రబాబు డిసైడయ్యారా?

తాను జూన్ 8 వరకు వరకు ముఖ్యమంత్రిగా ఉంటానని చంద్రబాబు చెప్పడం ద్వారా.. ఓటమి తప్పదనే అంచనాకు వచ్చి ఉంటారనే చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: April 21, 2019, 2:39 PM IST
‘జూన్ 8 వరకు నేనే సీఎం’.. దిగడానికి చంద్రబాబు డిసైడయ్యారా?
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఇటీవల చంద్రబాబు నాయుడు ఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్ 8 వరకు తానే ముఖ్యమంత్రినని, 2014లో జూన్ 8న ప్రమాణస్వీకారం చేశాను కాబట్టి, 2019లో కూడా అదే రోజు వరకు తాను సీఎంగా ఉంటానని ప్రకటించారు. ఇటీవల ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాతో చంద్రబాబునాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఎనిమిది వారాల సమయం ఇస్తారని చెప్పారు. అంటే పరోక్షంగా తనకు కూడా ఎన్నిల ఫలితాలు వచ్చిన తర్వాత కొంత సమయం ఇవ్వాలనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని రాజకీయ నాయకులు చెబుతున్నారు.

ap cm Chandrababu Naidu birthday celebrations in Hyderabad,కుటుంబంతో కలిసి జన్మదిన వేడుకల్లో చంద్రబాబు...కేక్ కట్ చేసిన సీఎం,nara lokesh,lokes tweet to chandrababu,lokesh wishes to chandrababu,lokesh birthday wishes to chandrababu,pm modi,narendra modi,modi wishes to chandrababu,pm modi wished ap cm,chandrababu naidu,ys jagan mohan reddy,chandrababu birthday,jagan wishes to chandrababu,chandrababu birthday date,jagan birthday wishes to chandrababu,jagan twitter wishes,చంద్రబాబుకు జగన్ శుభాకాంక్షలు,ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపిన జగన్,చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు,చంద్రబాబు పుట్టినరోజు,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,ప్రధాని మోదీ శుభాకాంక్షలు,చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ,చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోదీ,నారా లోకేష్ ట్వీట్,చంద్రబాబుకు లోకేష్ శుభాకాంక్షలు,చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన లోకేష్
భార్య భువనేశ్వరికి కేక్ తినిపిస్తున్న సీఎం చంద్రబాబు


ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మే 23న ఫలితాలు రానున్నాయి. మెజారిటీ వచ్చిన పార్టీ గవర్నర్ వద్దకు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా కోరుతుంది. ప్రస్తుతం ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే ఓకే. ఒకవేళ ప్రభుత్వం మారితే, ఆ పార్టీ బాధ్యతలు తీసుకునే వరకు ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతుంది. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసే వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.

ఓటు హక్కును వినియోగించుకున్న చంద్రబాబు కుటుంబం


అయితే, తాను జూన్ 8 వరకు వరకు ముఖ్యమంత్రిగా ఉంటానని చంద్రబాబు చెప్పడం ద్వారా.. ఓటమి తప్పదనే అంచనాకు వచ్చి ఉంటారనే చర్చ జరుగుతోంది. అందుకే జూన్ 8 వరకు తానే సీఎంగా ఉంటానని చెబుతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఓటర్లు తీర్పు ఇచ్చి గెంటేస్తే కూడా ఇంకా కొనసాగుతారా? అంటూ చంద్రబాబు మీద వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
First published: April 21, 2019, 2:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading